టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
చంద్రబాబు కోర్ట్ తీర్పు ప్రకారం రిమాండ్ కి వెళ్ళారు అని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది.. అవినీతి చేసిన వారిని ఎవరిని వదిలేది లేదు.. హెరిటేజ్ సంస్థ నుంచి వచ్చే డబ్బులు ఉన్నప్పటికీ.. అవినీతి సొమ్ముకు చంద్రబాబు ఆశ పడ్డాడు.. ఇన్నర్ రింగ్ లేకుండా అవినీతి ఎలా జరుగుతుంది అని ప్రశ్నించే టీడీపి నేతలుకి అక్కడ భూముల రెట్లు ఎందుకు పెరిగాయో తెలియదా అని ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు.