(అక్టోబర్ 7న దర్శకులు శివ నాగేశ్వరరావు పుట్టినరోజు) ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అంటారు. ‘నవ్విస్తూ తానవ్వక ఒప్పిస్తూ తిరుగువాడు శివనాగేశ్వరరావు’ అంటారు తెలుగు సినిమా జనం. దర్శకుడు శివనాగేశ్వరరావును చూస్తే ‘ఈయనేనా… ‘మనీ’లాంటి నవ్వుల నావను నడిపించింది…’ అన్న అనుమానం కలుగుతుంది. ఆయనలో అంత ‘హ్యూమర్’ ఉందని నమ్మబుద్ధి కాదు. కానీ, ఒక్కసారి శివనాగేశ్వరరావుతో మాట్లాడితే తాను నవ్వకుండానే మన పొట్టలు చెక్కలు చేసేస్తూ ఉంటారు. ఆయన తీరిక సమయంలో, మనకు ఓపిక ఉండాలే…