Krishna Vamsi Comments on Sirivennela Sitaramasastri: గతంలో అద్భుతమైన సినిమాలు చేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో సాలిడ్ హిట్ అందుకోలేకపోయారు. గత ఏడాది ఆయన చేసిన రంగమార్తాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకి ఉన్న అనుభవాలను ఈటీవీ విన్ లో ప్రసారమవుతున్న నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. సీతారామశాస్త్రితో…
ఇప్పటి వరకు సెన్సార్ కట్ పడకుండా సంసారపక్షంగా చిత్రాలు తెరకెక్కిస్తూ సాగుతున్నారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. ఈ మధ్యే ఆయన ‘ఆర్గానిక్ మామ.. .హైబ్రీడ్ అల్లుడు…’ అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో మానవసంబంధాలు, వాటి విలువలకు పీట వేస్తూనే తసదైన పంథాలో వినోదాన్ని చొప్పించేవారు. అందువల్లే ఎస్వీకే సినిమాను చూడటానికి అప్పట్లో ఆబాలగోపాలం పరుగులు తీసేవారు. పాతికేళ్ళ క్రితం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆహ్వానం’ కూడా జనాన్ని అలాగే అలరించింది. 1997 మే…
తనదైన శైలితో తెలుగువారిని విశేషంగా అలరించిన గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి శాశ్వతంగా కలం మూసేశారు. తెలుగు సినిమా పాటలతోటలో సీతారామశాస్త్రి వాణి, బాణీ ప్రత్యేకమైనవి. ‘సిరివెన్నెల’ సినిమాలో అన్ని పాటలూ పలికించి, జనాన్ని పులకింప చేసిన సీతారామశాస్త్రి, ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా జేజేలు అందుకున్న ఆయన కొద్ది రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిమోనియాతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచీ వెంటిలేటర్ పై ఉన్న సీతారామశాస్త్రి…