Krishna Vamsi Comments on Sirivennela Sitaramasastri: గతంలో అద్భుతమైన సినిమాలు చేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో సాలిడ్ హిట్ అందుకోలేకపోయారు. గత ఏడాది ఆయన చేసిన రంగమార్తాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకి ఉన్న అనుభవాలను ఈటీవీ విన్ లో ప్రసారమవుతున్న నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. సీతారామశాస్త్రితో తనకు ఎనలేని అనుబంధం ఉండేదని ఆయన చెప్పకొచ్చారు. ఆయన రాసిన ఆదిభిక్షువు పాట వినగా వెంటనే ఆలోచనలో పడిపోయి ఇంత గొప్ప సాహిత్యాన్ని ఎవరు రాశారా అని తెలుసుకునే ప్రయత్నం చేశానని అన్నారు. బ్రహ్మ నీ రాత తారుమారు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో మొదటిసారిగా సిరివెన్నెల సీతారామశాస్త్రిని చూశానని గుర్తు తెచ్చుకున్నారు.
Anasuya: అనసూయ-సుశాంక్ లను విడదీయడానికి ప్రయత్నాలు.. ఇన్నాళ్లకు బట్టబయలైన నిజం
ఆయన సినిమా ఆఫీసులోనే పాట రాస్తూ ఒక సందర్భంలో తనను చూసి ఆఫీస్ బాయ్ అనుకుని మంచినీళ్లు టీ తీసుకురమ్మని చెప్పారు. అయితే అప్పుడు నన్ను ఆఫీసు బాయ్ అనుకుంటున్నారనే విషయం అప్పుడు అర్థమైంది. అయినా నేనేమీ అసిస్టెంట్ డైరెక్టర్ ని అని చెప్పలేదు, అలాగని హర్ట్ కాలేదు వెంటనే వెళ్ళడానికి టీ తీసుకొచ్చి ఇచ్చాను. ఆ తర్వాత శివ సినిమా సమయంలో మరోసారి కలుసుకున్నాం అక్కడి నుంచి వరుసగా సినిమాలకు కలిసి పనిచేశామని అన్నారు. ఆయనతో సన్నిహిత్యం నెమ్మదిగా బలపడుతూ వచ్చిందని ఈ సందర్భంగా కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. ఆయనతో అత్యంత ఉండే వారిలో తాను కూడా ఒకడిని కావడం తన అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.