తెలుగుమ్మాయి బండ్ల శిరీష.. అంతరిక్ష పర్యటనకు వెళ్లనుంది. స్పేస్ టూరిజాన్ని ప్రోత్స హించడంలో భాగంగా వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహిస్తున్న ఈ స్పేస్ ఫ్లైట్‌లో.. శిరీష ప్రయాణిం చనున్నారు. భారత్ మూలలుండి అంతరిక్షంలోకి వెళ్తున్న నాలుగో వ్యక్తి బండ్ల శిరీష. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ స్పేస్ ఫ్లైట్ ను పంపిస్తోంది. ఇందులో సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, సంస్థ లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కాలిన్ బెన్నెట్, కంపెనీ చీఫ్ ఆస్ట్రోనాట్…
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు చెందిన శిరీష అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగానూ నిలిచింది. అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో భారతీయురాలిగా గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందంలో శిరీష ఒకరు. టీమ్‌లో ఆమెతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు. కాగా శిరీషకు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ టీమ్ సక్సెస్ అవ్వాలని…