బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి షణ్ముఖ్, సిరి ఒక్కటిగానే ఏ గేమ్ అయినా ఆడుతున్నారు. ఒకరికి ఒకరికి సాయం చేసుకోవడం లేదని మిగిలిన ఇంటి సభ్యులతో బుకాయించినా, కొన్ని సందర్భాలలో వీరిని నిలదీసినప్పుడు ‘అది మా స్ట్రేటజీ’ అంటూ తప్పించుకునే వారు. ఈ ఇద్దరికీ ఆ తర్వాత జెస్సీ జత కలిశాడు. ముగ్గురూ కలిసి గూడుపుఠాణీ చేస్తున్నారంటూ కొందరు వీరికి ముద్దుగా త్రిమూర్తులు అనే పేరూ పెట్టారు. అయితే, రెండు వారాల క్రితం…
బిగ్ బాస్ సీజన్ 5 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ హౌస్ ని రణరంగం మారుస్తున్నారు. హౌస్ లో వారి ప్రవరత్న బయట వారి కుటుంబ సభ్యులపై పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా షన్ను, సిరి ల కిస్ సీన్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించిన సిరి బాయ్ ఫ్రెండ్.. నేను ఏడవాలా..? అంటూ నెటిజన్స్ కి కౌంటర్ ఇచ్చి…
బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్ లు, ఎలిమినేషన్స్ సెగల మధ్య కంటెస్టెంట్ల స్నేహాలు, నవ్వులు కొంత ఉపశమనం కలిసాగిస్తున్నాయి. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సిరి, షన్నుకి ముద్దు పెట్టింది. దానికి షన్ను సిగ్గు పడడం, కెమెరాల వంక చూస్తూ అన్ని రికార్డ్ చేశారా..? ఇప్పడు ఉంటుంది నాకు అని అనడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది.…
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈసారి కంటెస్టెంట్స్ అంతా ఎవరి స్ట్రాటజీతో వాళ్ళు ఆడుతున్నారు. గొడవలతో, ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ వీకెండ్ తో 6 వారాల షో పూర్తవ్వనుంది. ఈ వీక్ 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కాగా ఈ వీక్ మొత్తం బొమ్మల కొలువులోనే గడిచిపోయింది. రెండు టీంలుగా ఏర్పడిన ఇంటి సభ్యులు టెడ్డీలను కుట్టాలి. సిరి, కాజల్ ఇద్దరూ సంచాలకులుగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో సంచాలకులకు, ఇంటి…
‘బిగ్ బాస్ 5’ హౌస్ గొడవలతో హీటెక్కుతోంది. షో 5వ వారం నడుస్తుండగా… ఇప్పటికే పలువురు వీక్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు తమకు తోచిన స్ట్రాటజీలతో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అయితే హౌస్ లో ఎక్కువగా గొడవలు మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఈరోజు కెప్టెన్ టాస్క్ కంటెండర్ల కోసం జరగనున్న ఫైట్ మాత్రం ఆసక్తిని రేపుతోంది. Read Also : బిగ్ బాస్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’! ఇదిలా ఉండగా సోమవారం…
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించి వ్యూవర్స్ అంచనా కరెక్ట్ అయ్యింది. నటి ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్ లో లక్కీగా నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యాడు. ఈ రోజు డేంజర్ జోన్ లో ఉన్న నలుగురిలో మొదట ఆర్జే కాజల్ సేవ్ అయ్యింది. ఓ సినిమా పాటను ప్లే చేసి, అందులో ఎవరు పేరు ఉంటే…
“బిగ్ బాస్ సీజన్ 5” కంటెస్టెంట్ సిరిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టాస్క్ సమయంలో సన్నీ తనను అసభ్యకరంగా తాకాడంటూ సిరి ఆరోపించడంతో దానికి కారణమైంది. బిగ్ బాస్ సీజన్ 2లో భాను, తేజస్విలతో ఆమెను పోలుస్తున్నారు. సీజన్ 2 సమయంలో భాను శ్రీ, తేజస్వి మరో కంటెస్టెంట్ కౌశల్‌తో ఇలాగే ప్రవర్తించారు. ఫిజికల్ టాస్క్ సమయంలో లేడీ కంటెస్టెంట్‌లను అతను అసభ్యకరంగా తాకాడంటూ ఆరోపించారు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. వారు ఆరోపించినట్లుగా…
బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు. బిగ్ బాస్ షో కు సంబంధించి గతంలో కంటే సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పినా… ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇలా బయటకు రాగానే అలా వారిపేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రకంగా నిన్న రాత్రి నుండి ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతోంది సరయు అనే ప్రచారం జరిగిపోయింది. దాన్ని బలపరుస్తూ సరయు బిగ్…
లోబో ను ఒకసారి చూసినవాళ్లు ఎవరూ జీవితంలో అతన్ని మర్చిపోలేరు! అతగాడి వేషధారణ, ప్రవర్తన అంత డిఫరెంట్ గా ఉంటుంది. మాటీవీ మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా చేస్తుండే లోబో… కొన్ని సినిమాల్లోనూ కమెడియన్ గా నటించాడు. కానీ ఎందుకో రావాల్సినంత గుర్తింపు రాలేదు. బహుశా అతని నటనలో మొనాటనీ అందుకు కారణం కావచ్చు. గతంలో ఓ సారి బిగ్ బాస్ షో కు ఎంపికైన లోబో…. ఆ విషయాన్ని లీక్ చేయడంతో చివరి క్షణంలో…