బిగ్ బాస్ సీజన్ 5 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ హౌస్ ని రణరంగం మారుస్తున్నారు. హౌస్ లో వారి ప్రవరత్న బయట వారి కుటుంబ సభ్యులపై పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా షన్ను, సిరి ల కిస్ సీన్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించిన సిరి బాయ్ ఫ్రెండ్.. నేను ఏడవాలా..? అంటూ నెటిజన్స్ కి కౌంటర్ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టాడు. కానీ, ఈ ముద్దు విషయమై ఇప్పటివరకు షన్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా మాట్లాడకపోవడం చర్చానీయాంశంగా మారింది.
దీప్తి మౌనం వహించడంతో వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని కొందరు.. ఇంకొందరైతే ఏకంగా బ్రేకప్ కూడా అయిపోయిందని గుసగుసలాడుతున్నారు. అయితే ఈ గుసగుసలు కూడా కారణం లేకపోలేదు.ఎం షన్ను బిగ్ బాస్ కి వెళ్ళినప్పటినుంచి అతడి కోసం దీప్తి ఓట్లు అడుగుతూ ఒక రేంజ్ లో ప్రమోషన్ చేసింది. అయితే తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి షన్ను ని రిమూవ్ చేసింది. దీంతో వీరిద్దరు విడిపోయారు అని నెటిజన్లు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. కాగా, సిరి ముద్దుపెట్టడంపై షన్ను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యినట్లు తెలుస్తోంది. అందుకే దీప్తి ఏమి మాట్లాడలేకపోతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే దీప్తి స్పందించాల్సిందే..?