లోబో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోబో ను ఒకసారి చూసినవాళ్లు ఎవరూ జీవితంలో అతన్ని మర్చిపోలేరు! అతగాడి వేషధారణ, ప్రవర్తన అంత డిఫరెంట్ గా ఉంటుంది. మాటీవీ మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా చేస్తుండే లోబో… కొన్ని సినిమాల్లోనూ కమెడియన్ గా నటించాడు. కానీ ఎందుకో రావాల్సినంత గుర్తింపు రాలేదు. బహుశా అతని నటనలో మొనాటనీ అందుకు కారణం కావచ్చు. గతంలో ఓ సారి బిగ్ బాస్ షో కు ఎంపికైన లోబో…. ఆ విషయాన్ని లీక్ చేయడంతో చివరి క్షణంలో అతన్ని తప్పించారని అంటారు. నిజానిజాలు బిగ్ బాస్ కు, లోబోకు తెలియాలి.
Read Also : బిగ్ బాస్-5 : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది తనేనా ?
Also Read
ఇదిలా ఉంటే… బిగ్ బాస్ సీజన్ 5లో ఛాన్స్ దక్కించుకున్న లోబో… హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి రోజు మాత్రమే కాదు… రెండో రోజు సైతం తన యాటిట్యూడ్ ను చూపించాడు. రెస్ట్ రూమ్స్ సరౌండింగ్స్ క్లీనింగ్ బాధ్యతను లోబో తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. అక్కడ విడిచిన బట్టలను తగిలించడానికి కొక్కాలు (హుక్స్) లేవని, వాటిని తక్షణమే పెట్టించమని బిగ్ బాస్ నిర్వాహకులకు లోబో కాస్తంత గట్టిగానే చెప్పాడు. అదే సమయంలో శ్వేత వర్మతోనూ కాస్తంత స్వరం పెంచి మాట్లాడాడు. ఈ విషయంలోనే కాదు… తనతో ఎవరు కాస్తంత ఎదురు మాట్లాడినా సహించేదే లేదంటున్నాడు లోబో. అయితే… అలాంటి యాటిట్యూడ్ ఉన్న లోబో… రెండో రోజు మధ్యాహ్యం సిరితో గొడవ పెట్టుకోవడం… ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకోవడం చూసి అది నిజంగా జరుగుతున్నదే అని చాలా మంది భ్రమపడ్డారు. కానీ ఆ తర్వాత అది అబద్ధమని తేలిపోయింది. ఈ విషయంలో ఇటు సిరి, అటు లోబో ఇద్దరిదీ తప్పు ఉన్నా… స్మోకింగ్ ఏరియాలో ఈ విషయమై లోబో… సరయుకు వివరణ ఇచ్చి, తాము చేసిన ప్రాంక్ కు మెడలో ఉన్న మైక్ సాక్షం అని చెప్పడంతో ఆమె సైతం కన్వెన్స్ అయిపోయింది. మామూలుగా ఉంటేనే లోబో ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తుంది. దానికి మరింత ఎక్స్ ట్రా డోస్ యాడ్ చేస్తే… తట్టుకోవడం కష్టమే. ఈ విషయాన్ని లోబో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని వ్యూవర్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!