“బిగ్ బాస్ సీజన్ 5” కంటెస్టెంట్ సిరిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టాస్క్ సమయంలో సన్నీ తనను అసభ్యకరంగా తాకాడంటూ సిరి ఆరోపించడంతో దానికి కారణమైంది. బిగ్ బాస్ సీజన్ 2లో భాను, తేజస్విలతో ఆమెను పోలుస్తున్నారు. సీజన్ 2 సమయంలో భాను శ్రీ, తేజస్వి మరో కంటెస్టెంట్ కౌశల్‌తో ఇలాగే ప్రవర్తించారు. ఫిజికల్ టాస్క్ సమయంలో లేడీ కంటెస్టెంట్‌లను అతను అసభ్యకరంగా తాకాడంటూ ఆరోపించారు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. వారు ఆరోపించినట్లుగా కౌశల్ తాకలేదని తరువాత ప్రూవ్ అవ్వడంతో నెటిజన్లు లేడీ కంటెస్టెంట్లపై విరుచుకు పడ్డారు. కావాలనే కౌశల్ ను టార్గెట్ చేశారంటూ వాళ్ళను ఎలిమినేట్ చేసేదాకా శాంతించలేదు.
Read Also : బిగ్ బాస్ హౌస్ లో ‘ఆ గట్టునుంటావా… ఈ గట్టునుంటావా’!
అయితే అప్పట్లో భాను విషయంలో కౌశల్ నిజంగానే అలా చేశాడా ? సందేహం వచ్చింది ప్రేక్షకులకు. అందుకే ముందుగా ప్రేక్షకులు కొంతమంది కౌశల్ కు సపోర్ట్ చేస్తే, మరికొంత మంది మాత్రం భానుకు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు సిరి విషయంలో సన్నీ తప్పు చేయలేదని చాలా స్పష్టంగా ఉంది. అతను సిరి నుండి లాఠీలను దొంగిలించడానికి శ్వేత సహాయం తీసుకున్నాడు. ఇంతకుముందు వరకు లోబో సిరిని సీతాకోకచిలుక పిలవడంతో సిరిపై ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడు అదే నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె చీప్ ట్రిక్స్ తో సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. మొత్తం మీద ఆమె సన్నీ మీద చేసిన ఆరోపణలు బెడిసి కొట్టాయి. అతనికి సానుభూతి పెరుగుతుండగా, సిరిపై మాత్రం నెగెటివిటీ ఎక్కువయ్యింది.