బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించి వ్యూవర్స్ అంచనా కరెక్ట్ అయ్యింది. నటి ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్ లో లక్కీగా నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యాడు. ఈ రోజు డేంజర్ జోన్ లో ఉన్న నలుగురిలో మొదట ఆర్జే కాజల్ సేవ్ అయ్యింది. ఓ సినిమా పాటను ప్లే చేసి, అందులో ఎవరు పేరు ఉంటే వారు సేవ్ అయినట్టేనని నాగార్జున తెలిపారు. ఆ తర్వాత ‘కాజల్ చెల్లివా… కరీనాకు కజిన్ వా’ అనే పాటను ప్లే చేశారు. మరికొంత సేపటికి నటి ప్రియా వస్తువును నాగార్జున డిస్ ప్లే చేయడంతో ఆమె కూడా సేవ్ అయిపోయింది. చివరిలో నటరాజ్ మాస్టర్ అండ్ ఉమాదేవికి రెండు గన్స్ ఇచ్చి, ఎవరి గన్ నుండి గ్యాస్ వస్తే వారు సేవ్ అయినట్టు నాగ్ చెప్పారు. ఆ సమయంలో నటరాజ్ మాస్టర్ గన్ లోంచి గ్యాస్ వచ్చింది. చివరి క్షణం వరకూ ఉత్కంఠను మనసులోనే దాచుకున్న నటరాజ్ మాస్టర్ ఒక్కసారిగా సేవ్ అయ్యానని తెలియగానే… కన్నీటి పర్యంతమయ్యారు. ఉమాదేవి మాత్రం చాలా నిబ్బరంగా హౌస్ లోంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత నాగ్ కోరిక మేరకు ‘కుండ బద్దలు కొట్టి’ సిరి, లహరి, ప్రియ, షణ్ముఖ్, రవి, లోబో, యాని, నటరాజ్ మాస్టర్ గురించి తన మనసులోని మాటను తెలిపింది.
డాన్స్ లో బోయ్స్ బెస్ట్! గెలిచింది మాత్రం గర్ల్స్!
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ ఎలిమినేషన్ రోజున నాగార్జున ఇంటి సభ్యులలో జోరు నింపే ప్రయత్నం చేశారు. అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య డాన్స్ పోటీ పెట్టారు. దానికి న్యాయ నిర్ణేతగా తానే వ్యవహరించారు. ఈ ‘డెస్టినీ గేమ్’లో ఉమాదేవి షణ్ముఖ్ తో; లహరి జస్వంత్ తో; కాజల్ లోబోతో; శ్వేతవర్మ సన్నీతో; ప్రియ రవితో; హమీదా శ్రీరామచంద్రతో; ప్రియాంక మానస్ తో; యానీ విశ్వతో; సిరి నటరాజ్ తో సినిమా పాటలకు డాన్స్ చేశారు. ఇందులో బోయ్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అమ్మాయిలు డాన్స్ చేసి మెప్పించడంలో విఫలం అయ్యారు. ఇందులో బోయ్స్ కు 71 మార్కులు, గర్ల్స్ కు 67 మార్కులు వచ్చాయి. అయితే… టోటల్ కౌంటింగ్ ను తప్పుగా చెప్పిన కారణంగా నాగార్జున బోయ్స్ ను ఫెయిల్ చేసి, విజేతలుగా గర్ల్స్ ను ప్రకటించారు.
దీని తర్వాత కూడా నాగార్జున ఓ ఆసక్తికరమైన ఆటను బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఆడించారు. ‘ఇంట్లో ఉన్న దెయ్యం’ అనే ఈ గేమ్ లో హౌస్ మేట్స్ తో తాము దెయ్యంగా ఎవరిని భావిస్తున్నారో వాళ్ళ నుదుటిన డెవిల్ స్టిక్కర్ అంటించమని నాగ్ చెప్పారు. ఇందులో అత్యధికంగా అంటే ఆరు మంది సిరికి డెవిల్ స్టిక్కర్ అంటించారు. సిరికి స్టిక్కర్ అంటించిన వారిలో ప్రియ, జస్వంత్, శ్వేత వర్మ, షణ్ముఖ్, ఉమ, లోబో ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది చెప్పిన కారణం ప్రియ సమయానికి నిద్రపోకుండా అందరికీ నిద్రాభంగం కలిగిస్తుందనేదే!
కాజల్ కోరికతో సభ్యులకు మటన్ బిర్యానీ!
ఈ వారం ఎలిమినేషన్ నుండి సేవ్ అయిన ఆర్జే కాజల్ నాగార్జునను ఓ కోరిక కోరింది. కొద్ది రోజులుగా మటన్ బిర్యానీ తినాలనిపిస్తోందని చెప్పింది. ఆమె మాటను మన్నించిన నాగ్… మటన్ హౌస్ లోకి పంపుతానని, అయితే దాన్ని వండే బాధ్యతను ఇతరుల సహాయంతో అయినా కాజల్ తీసుకోవాలని ఆర్డర్ వేశారు. అందుకు కాజల్ యస్ చెప్పింది. ఇక ఆదివారం యాంకర్ రవి పుట్టిన రోజు సందర్భంగా నాగ్ బర్త్ డే విషెస్ చెప్పారు. రవి భార్య ఓ గోల్డ్ రింగ్ తో పాటు… తన ప్రేమను తెలియచేస్తూ ఉత్తరాన్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపింది. గత కొన్ని రోజులుగా సభ్యులు తప్పు చేసినా… చూసీచూడనట్టు పోతున్న బిగ్ బాస్ సోమవారం మాత్రం షణ్ముఖ్ కు పెద్ద శిక్షే వేశాడు. పట్టపగలు నిద్రపోయినందుకు షణ్ముఖ్ ను 21 సార్లు స్విమ్మింగ్ ఫూల్ లో దూకమని కెప్టెన్ విశ్వ ఆర్డర్ వేశాడు. ప్రోమో ద్వారా ఈ విషయం వ్యూవర్స్ కు తెలిసింది. మరి సోమవారం ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ లోని ఈ శిక్ష ఎలాంటి వివాదాలకు, చర్చలకు దారితీస్తుందో చూడాలి!