టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేనప్పుడు తాను మరింత మెరుగ్గా రాణిస్తా అని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. బుమ్రా లేనపుడు తనపై బౌలింగ్ బాధ్యత ఉంటుందని, ఆ సమయంలో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. బాధ్యత తనలో ఆనందాన్ని రేకెత్తిస్తుందని, అలానే ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందన్నాడు. సహచర బౌలర్లతో ఎప్పుడూ మాట్లాడుతానని, మనం సాధించగలమనే నమ్మకాన్ని వారిలో కలిగించేందుకు కృషి చేస్తా అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025, ఇటీవలి ఇంగ్లండ్…