మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్ హీరోస్ అనే లిస్టు తీస్తే అందులో ధనుష్ పేరు టాప్ 5లో ఉంటుంది. రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్, తెలుగు-తమిళ భాషల్లో చేసిన మొదటి బైలింగ్వల్ మూవీ ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సార్ సినిమాకి జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్, సార్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది. మిగిలిన తమిళ స్టార్…
ప్రముఖ దర్శకుడు భారతీరాజా 'సార్' చిత్రంలో అతిథి పాత్రలో మెరిసారు. ఇటీవల ఈ సినిమాను చూసిన ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్ లో చూడాలని ఆయన కోరారు.
ధనుష్ 'రఘువరన్ బీటెక్' మూవీ టోటల్ రన్ కు వచ్చిన కలెక్షన్లు 'సార్' తొలిరోజున రాబోతున్నాయని చిత్ర నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. ప్రీమియర్స్ సైతం పబ్లిక్ డిమాండ్ కారణంగా నలభై వేయాల్సి వచ్చిందని అన్నారు.
ఈ వీకెండ్ తెలుగులో ఓ అనువాద చిత్రంతో కలిపి మొత్తం ఐదు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో రెండు సినిమాలు శుక్రవారం, మూడు చిత్రాలు శనివారం రిలీజ్ కాబోతున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాటలని ఆటమ్ బాంబుల్లా పేలుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో SSMB 28 సినిమా చేస్తూ బిజీ ఉన్న త్రివిక్రమ్, ధనుష్ నటించిన బైలింగ్వల్ ప్రాజెక్ట్ ‘వాతి/సార్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. మైక్ అందుకుంటే మాటలతోనే మాయ చెయ్యగల త్రివిక్రమ్, ధనుష్ ని జనరేషన్ లో బెస్ట్ యాక్టర్ గా అభివర్ణించాడు. ఆ తర్వాత స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరి గురించీ మాట్లాడిన త్రివిక్రమ్, హీరోయిన్…
'భీమ్లానాయక్', 'బింబిసార' చిత్రాలతో వరస విజయాలను అందుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు ద్విభాషా చిత్రం 'సార్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలోని లెక్చరర్ పాత్ర తనకు నటిగా చక్కని గుర్తింపు తెచ్చిపెడుతుందని సంయుక్త ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
పాన్ ఇండియా మూవీస్ గా శివరాత్రికి విడుదల కావాల్సిన 'శాకుంతలం, ధమ్కీ' వాయిదా పడుతున్న నేపథ్యంలో రెండు చిన్న సినిమాలు ఆ స్థానంలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సంతోష్ శోభన్ నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు', యశ్వంత్ నటించిన 'ఊ అంటావా మావ... ఊ ఊ అంటావా మావ' ఈ నెల 18న రాబోతున్నాయి.
ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సుద్దాల అశోక్ తేజ 'సార్' చిత్రం కోసం 'బంజారా' గీతాన్ని రాశారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ స్వరరచన చేశారు.
Director Venky Atluri Engagement: సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామందే పెళ్లి పీటలు ఎక్కారు. ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే ‘స్నేహ గీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా థమ్కీ' రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఇది జనం ముందుకొస్తోంది. అయితే అదే తేదీన ఇప్పటికే 'సార్', 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలను విడుదల చేయబోతున్నట్టు ఆ యా చిత్రాల నిర్మాతలు తెలిపారు.