Dhanush: ‘రఘువరన్ బీటెక్’ టోటల్ కలెక్షన్స్… ‘సార్’కు ఒక్క రోజులో!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sir: కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (‘వాతి’). భారీ అంచనాలతో ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది. గురువారం సాయంత్రం ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు, విశ్లేషకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో తాజాగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “చాలా ఆనందంగా ఉంది. నాకు సంవత్సరం తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌస్ ఫుల్ అని ఫోన్లు వస్తున్నాయి. నిన్న ప్రీమియర్లకు మంచి టాక్ రావడంతో.. చిన్న చిన్న ఏరియాలలో కూడా మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. షో షోకి వసూళ్ళు పెరుగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ”భీమ్లా నాయక్, డీజే టిల్లు” సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు ‘సార్’ సినిమాకు అంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. మొదట ఒకటి రెండు ప్రీమియర్ షోస్ అనుకున్నాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో ఒక్క హైదరాబాద్ లోనే 25 ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తం 40 షోలు వేశాం. ధనుష్ గారి ‘రఘువరన్ బి.టెక్’ తెలుగులో టోటల్ రన్ మీద ఎంత వసూలు చేసిందో ఆ మొత్తం ఒక్కరోజులోనే ‘సార్’ కి వస్తాయి. తమిళ్ లో కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఓవరాల్ గా ధనుష్ కెరీర్ లో రికార్డు స్థాయి వసూళ్ళు వచ్చే అవకాశముంది” అన్నారు. తనకు ‘దిల్’ రాజు నుండి ఫోన్ వచ్చిన విషయాన్ని నాగవంశీ చెబుతూ, ”రాజు గారు ఫోన్ చేసి ఈ సినిమాకి డబ్బులు, పేరు రెండూ వస్తాయి. ఇంకోసారి నువ్వు నేషనల్ అవార్డుకి అప్లికేషన్ పెట్టుకునే సినిమా ఇది. ఇలాంటివి మరిన్ని తియ్యి” అని అభినందిచారని చెప్పారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, “చాలా సంతోషంగా ఉంది. 2018 లో వచ్చిన నా మొదటి సినిమా ‘తొలిప్రేమ’ తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరి నుంచి ఫోన్లు వస్తున్నాయి. విడుదలకు ముందు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. కానీ ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయాన్నే చెన్నై వెళ్లి మార్నింగ్ షో కూడా చూసొచ్చాను. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చివరి 15 నిమిషాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. నేను భాగమైన సినిమాకి ప్రేక్షకుల నుంచి ఇంతమంచి స్పందన రావడం గర్వంగా ఉంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకు వెళ్లిన వంశీ గారికి ధన్యవాదాలు” అని అన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!