మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాటలని ఆటమ్ బాంబుల్లా పేలుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో SSMB 28 సినిమా చేస్తూ బిజీ ఉన్న త్రివిక్రమ్, ధనుష్ నటించిన బైలింగ్వల్ ప్రాజెక్ట్ ‘వాతి/సార్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. మైక్ అందుకుంటే మాటలతోనే మాయ చెయ్యగల త్రివిక్రమ్, ధనుష్ ని జనరేషన్ లో బెస్ట్ యాక్టర్ గా అభివర్ణించాడు. ఆ తర్వాత స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరి గురించీ మాట్లాడిన త్రివిక్రమ్, హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి మాట్లాడుతూ మొదటి మాటగానే “లవ్ యు” అనేసాడు. దీంతో ప్రీరిలీజ్ ఈవెంట్ చూడడానికి వచ్చిన ఫాన్స్ అంతా అరుపులు, ఈలలు వేశారు. అభిమానుల ఇంటన్షన్ అర్ధం అయిన త్రివిక్రమ్, “ఆగండి, కంగారు పడకండి… పూర్తిగా వినండి” అని తన స్పీచ్ ని కంటిన్యు చేశాడు.
“నీ తరపున నా వైఫ్ కి హాయ్ చెప్తాను. థాంక్స్” అంటూ సంయుక్త గురించి ముగించాడు త్రివిక్రమ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రివిక్రమ్ స్పీచ్ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్, సంయుక్త మీనన్ అనే టాపిక్ భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి జరుగుతుంది. త్రివిక్రమ్ ఏ హీరోయిన్ తో వర్క్ చేసిన ఒక బ్యాచ్, అతనిపై ఫన్నీ మీమ్స్ వెయ్యడానికి రెడీగా ఉంటారు. ఆ విషయం తనకి కూడా తెలుసు కాబట్టే త్రివిక్రమ్, వెంటనే కంగారు పడకండా పూర్తిగా వినండి అని చెప్పినట్లు ఉన్నాడు. మలయాళంలో సినిమాలు చేసే సంయుక్త మీనన్ ని తెలుగులోకి తీసుకోని వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్. పవన్ కళ్యాణ్ తో వాళ్లు చేసిన భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్త మీనన్, రానాకి భార్యగా నటించింది. ఆ తర్వాత ఇప్పుడు ‘సార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఇది కాకుండా సంయుక్త ‘వినోదయ సిత్తం’ సినిమాలో కూడా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. తము ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ ని ప్రాజెక్ట్స్ ఇస్తూ బ్యాకింగ్ చెయ్యడం సితార ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్న మంచి పని. పైగా సంయుక్త కేవలం గ్లామర్ క్వీన్ మాత్రమే కాదు తను మంచి పెర్ఫర్మార్ కూడా. మంచి కంటెంట్ ఉన్న సినిమాలని సెలక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో సంయుక్త తెలుగులో మరో సమంతా, పూజా హెగ్డే స్థాయి హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది.