Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘‘తెలివైన కుట్ర’’కు తెర తీశారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావని ఆమె హెచ్చరించారు.
పార్లమెంట్‌లో వెంటనే ‘SIR’పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ భవన్ ఎదుట ప్రతిపక్ష సభ్యులంతా ప్లకార్డులు పట్టుకుని ‘సర్’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి.
Supreme Court: కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్‌ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే నిర్వహిస్తోంది. ఇటీవల బీహార్‌లో చేపట్టి విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం SIR ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఆమె నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనల్ని నిర్దేశిస్తోందని, రాబోయే సర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించవద్దని హెచ్చరించారు.
Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోంది. ఎవరూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి విజయం దిశగా వెళ్తోంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీల జోడీ బంపర్ హిట్ అయింది. మరోవైపు, కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి చతికిత పడింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహాఘట్బంధన్ కూటమి 50 సీట్ల లోపు పరిమితమైంది.
SIR: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీహార్‌లో ఇప్పటికే ఇది వివాదాస్పదం అయింది. నకిలీ ఓటర్లను తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించేందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టే ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది.
Voter roll revision: అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రారంభం కానున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు, ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసే లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రకటన రావచ్చు. కాన్ఫనెన్స్ కమ్ వర్క్ షాప్ సందర్భంగా ఓటర్ జాబితా సవరణకు ఎంత త్వరగా సిద్ధంగా ఉండొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అడిగినట్లు…