Singareni Jobs: సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Jobs: సింగరేణిలో మొత్తం 485 ఉద్యోగ ఖాళీలను నేడు విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు. సింగరేణి డైరెక్టర్లతో సీఎండీ బలరాం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. ప్రమాద బీమా కోసం యూబీఐతో గురువారం కీలక ఒప్పందం చేసుకోనున్నట్లు సీఎండీ వెల్లడించారు. సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న (బుధవారం) సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… సింగరేణిలో ఈ ఏడాది రూ.1000 హెరిటేజ్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలి. కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 26న కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లో సింగరేణి అతిథి గృహ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Read also: Philippines : ఫిలిప్పీన్స్‌లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
నిరుద్యోగ యువతకు నల్గొండ కలెక్టర్ శుభవార్త అందించారు. 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు 100కు పైగా కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల 26న నల్గొండలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా పోస్టర్‌ను నల్గొండ కలెక్టర్ హరిచందన Xలో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిచందన ప్రకటించారు.మరో 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 100 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్‌మెంట్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు సీవీ, అర్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది.
Philippines : ఫిలిప్పీన్స్‌లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
తాజావార్తలు
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!