Singareni Elections 2023 Polling Begins: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 11 డివిజన్‌లలోని 84 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి విస్తరించి ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి.…
Singareni Elections: రేపటి సింగరేణి పోరుకు సర్వం సిద్ధమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు రేపు 11 ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
సింగరేణి కార్మికులకు రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులను తాను ఆదుకుంటానని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు. గడిచిన పది సంవత్సరాలు నామవాత్ర ఉద్యోగాలు నియమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని పొంగులేటి చెప్పారు. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పుకొచ్చారు. ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ ఆఫీస్…
సింగరేణి ఎన్నికలను బహిష్కరిచాలంటూ కార్మికులకు పిలుపునిస్తూ మావోయిస్టుల విడుదల చేసిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు అనుమతించిన అనంతరం మావోయిస్టు పార్టీ సింగరేణి కార్మిక సమఖ్య (సికాస) కార్యదర్శి ప్రభాత్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. సింగరేణి ఎన్నికలను బహిష్కరించాలని లేదంటే TBGKS నాయకులకు శిక్ష తప్పదంటూ లేఖలో హెచ్చరించారు. ‘పోరాటల ద్వారానే హక్కులు సాధించుకోవాలి. కార్మిక…
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి లో గుర్తింపు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాగా వేయటానికి అటు ఏఐటీయూసీ ఇటు ఐఎన్టీయూసీ పావులు కదుపుతున్నాయి.
Singareni Elections: సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపింది. హైకోర్టు నిర్ణయం పై 27న జరిగే ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని IA పిటిషన్ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని యూనియన్ తరపున సీనియర్ కౌన్సిల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం…
Telangana High Court: సింగరేణి ఎన్నికల్లో మరో పెద్ద ట్విస్ట్. ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కార్మిక సంఘాల మధ్య పోరు తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం.
Singareni Elections: సింగరేణి ఎన్నికలు హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Singareni Elections: సింగరేణి ఎన్నికలపై విడనున్న సస్పెన్స్ ఇవాల్టితో వీడనుంది. ఇప్పటికే అక్టోబర్ నెలలోనే ఎన్నికలు జరుపాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే.. ఇవాళ ఆర్ఎల్సి అధ్యక్షతన అన్ని కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు.