Singareni Elections: సింగరేణి ఎన్నికలు హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవాల సింగరేణి ఎన్నికల పై నేడు కీలక విచారణపై హైకోర్టు తీర్పుతో ఉత్కంఠకు తెరలేపింది. ఈ నెల 28 న సింగరేణి లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది.
గత ఏడాది నుండి హై కోర్ట్ లోనే సింగరేణి ఎన్నిక వివాదం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడగిస్తు హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23 న సింగరేణి ఎన్నికలపై హై కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల పై సింగరేణి యాజమాన్యం చీఫ్ కోర్ట్ లో అప్పీల్ చేసింది. నేడు సింగరేణి ఎన్నిక పై హై కోర్ట్ తీర్పు కోసం చూస్తున్న వారికి స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Salman Khan: టైగర్ వస్తున్నాడు… లెక్క వెయ్యి కోట్ల నుంచి మొదలవుతుంది