Shruti Haasan: ఇప్పుడు టాలీవుడ్‌లో శ్రుతిహాసన్ టైమ్ నడుస్తోందని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో సీనియర్ హీరోల పక్కన శ్రుతిహాసన్ ఆడిపాడింది. దీంతో సంక్రాంతి శ్రుతిహాసన్‌దే అన్న చర్చ నడుస్తోంది. అయితే రెండు సినిమాల్లోనూ శ్రుతి పాత్రలు అంత గొప్పగా ఏం లేవనే టాక్ వచ్చింది. ముఖ్యంగా వీరసింహారెడ్డి మూవీలో పట్టుమని పావుగంట పాత్ర…
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో ఆ ముగ్గురూ రెండేసి సినిమాలతో సందడి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు శ్రుతీహాసన్, థమన్ కూడా రెండో సినిమాలతో జనం ముందుకు రావడం విశేషం.
ఒక్కోసారి అతి మంచితనంతో వ్యవహరించడం కూడా మంచిదేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలను విమర్శించడం కంటే... వాటి నిర్ణయాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుందని, క్షణికావేశంలో విమర్శలు చేస్తే, మనల్ని నమ్ముకున్న నిర్మాతలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని, కాబట్టి తన మాటలను అతి మంచితనంగా ఎవరైనా వ్యాఖ్యానించినా తాను బాధపడనని చిరంజీవి చెప్పారు.
Veera Simha Reddy: నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో నటించింది..