Shruti Haasan: విశ్వ నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. నటిగా, సింగర్ గా రెండు పక్కలా తనకు నచ్చిన వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ ఎంజాయ్.. కొన్నేళ్ల క్రితం శృతి జీవితంలో లేదు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రేమికుడు వదిలేసి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ కు గురైంది. మందుకు బానిసగా మారింది. దాని వలన తన రూపు రేఖలు కుడా మారిపోయాయి. అయితే ప్రేమను మర్చిపోవడానికి ప్రేమనే మందు అన్నట్లు శృతి జీవితంలోకి శంతను వచ్చాడు. అప్పటి నుంచి అమ్మడి జీవితం నవ్వులతో విరబూస్తోంది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. హిట్లు అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇక ఆ డిప్రెషన్ నుంచి శృతి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆమె చేసే చేతలలోనే తెలుస్తున్నాయి. మొదటి నుంచి శృతి ఫ్యాషన్ కు అనుగుణంగా ఉంటుంది. తాను వేసుకొనే బట్టల దగ్గర నుంచి ఒంటిపై వేయించుకొనే టాటూల వరకూ తన వ్యక్తిత్వాన్ని, తన మానసిక సస్థితిని తెలియజేస్తాయి. తాజాగా మరోసారి శృతి తన ఒంటిపై కొత్త పచ్చబొట్టుతో దర్శనమిచ్చింది. అయితే ఈసారి అమ్మడిలో కొత్తగా దైవ భక్తి కనబడడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Singer Sunitha: సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
ఇప్పటివరకూ శృతి శరీరంపై ముడు టాటూస్ ఉన్నాయి. ఒకటి మణికట్టు పైన గులాబీ.. రెండోది చెవి వెనుక సంగీతాన్ని గుర్తు చేసేలా ఒకటి.. ఇంకొకటి .. ఆమె వీపు పై భాగంలో శృతి అని తన పేరు. ఇక ఇప్పుడు ఆ పేరు పై భాగంలో మురగన్ ను గుర్తుచేసేలా ఆయన ఆయుధాన్ని టాటూగా వేయించుకుంది. అంతేకాకుండా ” నేను ఎప్పుడూ ఆధ్యాత్మికంగా మొగ్గు చూపుతున్నాను. మురుగన్ వేల్‌కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది మరియు ఈ పచ్చబొట్టు ద్వారా నా భక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. దీంతో శృతి నువ్వు మారిపోయావ్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం శృతి ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తోంది.