Salaar: సలార్ ఓవర్సీస్ హక్కులు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eye Popping Price Offered For Salaar Overseas Rights: భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’తో సరికొత్త సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ లాంటి మాస్ దర్శకుడితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్ కోసం యావత్ భారతీయులతో పాటు ఓవర్సీస్‌లో ఉన్న ఇండియన్స్ కూడా ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? ఎప్పుడెప్పుడు థియేటర్లపై దండయాత్ర చేద్దామా? అని వెయిట్ చేస్తున్నారు. ఎటు చూసినా.. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఈ రేంజ్‌లో క్రేజ్ ఉంది కాబట్టే.. ఈ ప్రాజెక్ట్ హక్కులు కనీవినీ ఎరుగని స్థాయిలో అమ్ముడుతుపోతున్నాయని సమాచారం.
Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?
Also Read
సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సలార్ ఓవర్సీస్ హక్కులను ఏకంగా రూ.100 కోట్లకు సొంతం చేసుకుందట. ఇది నిజంగా అతిపెద్ద అమౌంట్. ఇంతవరకు ఏ సౌంత్ ఇండియన్ సినిమా.. ఓవర్సీస్‌లో ఈ స్థాయిలో బిజినెస్ చేసిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి.. ‘సలార్’కి ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఓవర్సీస్‌లోనే కాదండోయ్.. ఇండియన్ సినీ పరిశ్రమలోనూ ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఉందని, ఊహించిన దానికంటే ఎక్కువ ఆఫర్లే వస్తున్నాయని తెలుస్తోంది. చూస్తుంటే.. ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా రూ.500 కోట్ల మార్కెట్‌ని దాటేసేలా ఉంది. ఒక్క కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోనే.. ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారని తెలిసింది.
Pathaan Bikini Row: పఠాన్ బికినీ వివాదం.. ఎట్టకేలకు నోరు విప్పిన డైరెక్టర్
ఇకపోతే.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, జగపతి బాబు సైతం ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తన హోంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!