IPL 2025: గిల్ vs అయ్యర్.. క్రేజీ పోటీ మాములుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ గతేడాది లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, ఈ సీజన్ లో మాత్రం ఆ జట్టు అసాధార ప్రదర్శనతో అదరగొడుతుంది. శుభ్ మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ సమిష్టిగా రాణిస్తూ ప్లేఆప్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచుల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో కెప్టెన్ గిల్ విజయం సాధించాడు. ఈ సీజన్లో అద్భుత ఫామ్ తో రాణించిన గిల్.. రెండు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. అంతకుముందు మ్యాచ్ లో కేకేఆర్ పై 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేరువలో అవుటైన గిల్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ కెప్టెన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో 156 స్ట్రైక్ రేట్ తో 389 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్ గా నిలిచాడు. అయ్యర్ 9 మ్యాచ్‌ల్లో మూడు అర్ద సెంచరీల సహాయంతో మొత్తం 288 పరుగులు చేశాడు. అంటే.. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య 100 పరుగుల వ్యత్యాసం ఉంది. కాగా, గుజరాత్‌కు అతిపెద్ద బలం ఆ జట్టు టాప్ ఆర్డర్. సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్, జోస్ బట్లర్ ఇలా ఎవరో ఒకరు పరుగుల వరద పారిస్తూ.. జట్టు బాధ్యతను తీసుకుంటున్నారు.
Read Also: Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం
అయితే, పంజాబ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేయకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. అయితే, అయ్యర్ నాయకత్వంకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ 9 మ్యాచుల్లో 5 గెలిచి 11 పాయింట్లతో టాప్ ఫైవ్ లో ఉంది. మొత్తం సీజన్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ 456 పరుగులతో టేబుల్ టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానములో విరాట్ కోహ్లీ 443 పరుగులతో ఉన్నాడు. చూడాలిమరి! గత సీజన్ లో కప్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ మరోసారి కప్ అందుకుంటాడో.. లేక గిల్ అందుకుంటాడో.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!