Chahal- Dhanashree: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి పేరును నెటిజన్‌లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం అతడి భార్య ధనశ్రీ వర్మ. ఆమెతో చాహల్ బంధం తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీవర్మ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరికీ లింక్ ఉన్నట్లు నెటిజన్‌లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారం ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి…
Yuzvendra Chahal: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పేరు మార్మోగిపోతోంది. చాహల్, అతడి భార్య ధనశ్రీ మధ్య విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. చాహల్ భార్య ధనశ్రీ సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం కలకలం రేపింది. ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన భర్త ఇంటిపేరు ‘చాహల్’ను తొలగించింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సెలబ్రిటీలు పేర్లు మార్చుకోవడం విడాకులకు దారి తీస్తుందని ఇటీవల పలు ఘటనలను నెటిజన్‌లు గుర్తుచేస్తున్నారు. గత…
భారత్ చేతిలో వెస్టిండీస్ మరోసారి చిత్తైంది. మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన విండీస్... టీ-20 సిరీస్‌నూ 1-4 తేడాతో భారత్‌కు సమర్పించుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ-20 మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టీమ్‌ఇండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సునాయాసంగా గెలిచేసింది. దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానంగా మిల్లర్, రస్సీ వాండర్ డుసెన్…
తమ కోల్‌కతా టీమ్ సెలక్షన్ విషయంలో సీఈవో కూడా జోక్యం చేసుకుంటాడని గత వారం శ్రేయాస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జట్టు ఎంపిక విషయంలో సీఈవో జోక్యం చేసుకోవడం ఏంటి? అసలు శ్రేయాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. రానురాను ఇది చినికి చినికి గాలివానగా మారడం మొదలయ్యింది. దీంతో, శ్రేయాస్ అయ్యర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘‘గత మ్యాచ్‌లో సీఈవో ప్రస్తావన తీసుకురావడం వెనుక అసలు…
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న కోల్‌కతా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టాపార్డర్ సహా మిడిలార్డర్ బ్యాట్స్మన్లందరూ పెద్దగా ఆశాజనకమైన ప్రదర్శన కనబర్చకపోవడంతో.. కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ, రసెల్ రాకతో ఆ ఊహాగానాలన్నీ తారుమారు అయ్యాయి. అప్పటివరకూ కోల్‌కతా బ్యాట్స్మన్లకు…
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ సంచలన విషయాలు బయటపెట్టాడు. తమ జట్టు ఎంపికలో కోచ్‌తో పాటు సీఈవో వెంకీ కూడా పాల్గొంటారంటూ వ్యాఖ్యానించాడు. 11 మంది సభ్యుల తుది జట్టులో నీకు చోటు లేదంటూ మరో ఆటగాడికి చెప్పడం ఎంతో కష్టంగా ఉంటుందన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు శ్రేయస్ అయ్యర్ గుర్తుచేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్…
బుధవారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. సాధించింది తక్కువ పరుగులే అయినా కోల్‌కతా బాగానే పోరాడింది. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని.. అయితే బ్యాటింగ్ విభాగం నిరాశపరిచిందని కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వివరించాడు. బెంగళూరు బౌలర్ హసరంగాను ఆడటంతో తాము పొరపాటు చేశామని పేర్కొన్నాడు. అతడి ఆఫ్ స్పిన్‌ను ఆటడంలో ప్రణాళికలు అమలు చేయడంలో తమ బ్యాట్స్‌మెన్ విఫలమై…