మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 108 అడుగుల విగ్రహం ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ స్థాయి మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శివరాం సింగ్ చౌహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది శంకరాచార్య ఎక్తా న్యాస్ ట్రస్ట్ తో జరిగిన మీటింగ్ లో దీనిపై చర్చించారు. ఈ విగ్రహం, మ్యూజియం ఏర్పాటు ద్వారా ఆదిగురువైన ఆదిశంకరాచార్య గురించి ప్రపంచానికి అనేక విషయాలు తెలుస్తాయని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయవచ్చని ప్రభుత్వం చెబుతున్నది.
Read: ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! ఐఎండీ వార్నింగ్
అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేస్తున్నది. విగ్రహం ఏర్పాటుకయ్యే ఖర్చుకు ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నదని ప్రశ్నిస్తోంది. రాష్ట్రబడ్జెట్ లో ఈ విగ్రహం ఏర్పాటకు బడ్జెట్‌ను కేటాయిస్తారా లేదంటే ఇతర పద్దతుల ద్వారా నిధులు సేకరిస్తారా అనే విషయాన్ని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. విగ్రహాలు ఏర్పాటు చేయడం తప్పు కాదని, దానికోసం సేకరించే నిధుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది.