టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 తదుపరి రౌండ్ మ్యాచ్‌లలో తాను ఆడనని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కి చెప్పాడు. డిసెంబర్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టడానికి తాను రంజీ ట్రోఫీలో ఆడానని ఎంసీఏకి తెలియజేశాడు. ఎంసీఏ కూడా సూర్యకుమార్ నిర్ణయంపై సానుకూలంగా స్పందించి.. అతడిని రంజీ ట్రోఫీ నుంచి రిలీజ్ చేసిందని ఓ జాతీయ మీడియా…
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (30) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్ (25) మినహా మిగతా కంగారో బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్,…
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె సేవల్ని గత కెప్టెన్ల కంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఉపయోగించుకుంటున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దూబెలోని బౌలర్‌ను సూర్య చక్కగా ఉపయోగించుకోవడం వల్లే దాయాది పాకిస్థాన్‌పై విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బాగా బౌలింగ్ చేస్తున్నారని వీరూ ప్రశంసించాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది.…
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయంలో మూగ్గురు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకడు ఆల్‌రౌండర్ శివమ్ దూబే. రెండు ఓవర్లు వేసిన దూబే.. 4 పరుగులు ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు. 12 బంతుల్లో 10 డాట్ బాల్స్ ఉండటం విశేషం. 2024 టీ20 ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆసియా…
టీ20 ఆసియా కప్ 2025లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో యూఏఈపై భారత్ రికార్డు విజయం సాధించింది.. యూఏఈపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్థి జట్టు యూఏఈ కేవలం 58 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. భారత్ బ్యాటర్లు కేవలం 4.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ, ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు. మొదటి ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లో శుభ్‌మన్…
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 13.1 ఓవర్లలో 57 పరుగులకే యూఏఈ కుప్పకూలింది. ఓపెనర్లు అలిషామ్ స్కార్ఫ్ (22), ముహమ్మద్ వసీమ్ (19) టాప్ స్కోరర్లు. మిగతా యూఏఈ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 3 కంటే ఎక్కువ పరుగులు ఎవరూ చేయకపోవడం విశేషం. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, శివమ్ దూబే…
CSK vs MI: ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 15.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది. ముంబై విజయానికి రోహిత్ శర్మ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. అయిదు ఓటముల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎంఎస్ ధోనీ (26 నాటౌట్; 11 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. శివమ్ దూబే (43 నాటౌట్; 37 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. అంతకు ముందు చెన్నై బౌలర్ నూర్…
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై కుప్పకూలింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.