జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించింది ఆలయ కమిటి. అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఆరోజుకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఏమి చేయబోతున్నారో తన ప్రణాళికను చెప్పారు. ఆ రోజు నాసిక్‌లోని కాలారం ఆలయాన్ని తాను, తన పార్టీ నేతలు సందర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి చేస్తారని…
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పై తిరుగుబావుటా ఎగరేయడంతో సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే.. ఈ సంక్షోభానికి బీజేపీయే కారణమన్న ఆరోపణలు, చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ‘మహా వికాస్ అఘాఢీ’ సంకీర్ణ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభాలు కొత్తేమీ కాదు. కానీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే…
మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా పుణేలో మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసులు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు రాజ్ ఠాక్రే. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. తాజాగా ఆదివారం పూణేలోని గణేష్ కళా క్రీడా మంచ్ లో భారీ…
నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి, టీయర్ గ్యాస్ ను కూడా వదిలారు. దీంతో ఆందోళన కారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే నేడు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం నేడు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బోధన్ లో ప్రత్యేక…
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తింది. బోధన్‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతలోనే ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా…
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ప్రేమజంటలకు శివసేన కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. వాలంటైన్స్‌డే రోజు ఎవరైనా పార్కుల్లో జంటలుగా కనిపిస్తే.. చితక్కొడతామని స్పష్టం చేశారు. వాలెంటైన్స్‌డే సందర్భంగా తాము వివిధ ప్రాంతాల్లో కర్రలను చేతబూని తిరుగుతామని, ఏ జంటలైనా కనిపించాయో.. వారికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం నాడు భోపాల్‌లో శివసేన కార్యకర్తలు కర్రలు చేతబూని వాటికి కాళికా దేవి మందిరంలో పూజలు కూడా నిర్వహించారు.…