మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పై తిరుగుబావుటా ఎగరేయడంతో సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే.. ఈ సంక్షోభానికి బీజేపీయే కారణమన్న ఆరోపణలు, చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ‘మహా వికాస్ అఘాఢీ’ సంకీర్ణ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభాలు కొత్తేమీ కాదు. కానీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
గత కొంతకాలంగా మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన అధిష్టానం(ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే)పై అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని భావించిన షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అదును చూసి తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 35 మందికిపైగా ఎమ్మెల్యేలను లాక్కెళ్లిన షిండే.. తర్వాత ఆయన అడుగులు ఎటువైపు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ పరిణామాలన్నింటీని కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాజకీయ ఉద్ధండుడైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంతంటి సంక్షోభాన్ని ముందే ఎందుకు ఊహించలేదనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
48 గంటల్లోనే రాజీనామా..
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ఏ విధమైన ‘ద్రోహాన్ని’ మరచిపోయే, క్షమించే పార్టీ కాదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవిస్ 48 గంటల్లోనే రాజీనామా చేశారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించడంతో ఫడ్నవీస్ రాజీనామా అనివార్యమైంది. ఈ విషయాన్ని బీజేపీ అంత తేలికగా ఎలా వదిలిపెడుతుంది..? ‘నేను సముద్రాన్ని.. మరింత బలంగా మళ్ళీ వస్తాను’ అని బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ సమయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
2019 ఎన్నికల్లో కలిసి పోటీచేసి..
2019 ఎన్నికల్లో శివసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. BJP 106 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 56 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే.. ఎన్నికల ముందు చర్చించినట్లుగా భాగస్వామ్య పక్షాల మధ్య ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని శివసేన మెలికపెట్టింది. దీనికి బీజేపీ అంగీకరించలేదు. ఇలాంటి ఒప్పందం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేసింది. అయినా ముఖ్యమంత్రి పదవి కావాలంటూ శివసేన మొండికేసింది. దీంతో రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో ఆ పార్టీల మధ్య దూరం పెరిగింది.
శరద్ పవార్ రంగంలోకి దిగి..
2019 నవంబర్ లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కీలకపాత్ర పోషించారు. NCP, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన నిర్ణయించుకునే వరకూ అంటే దాదాపు నెల రోజుల పాటు రాజకీయ నాటకం కొనసాగింది. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి మహా వికాస్ అఘాఢీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే..ప్రభుత్వ పదవులను, అధికారాలను కోరుకోని తన తండ్రి, బాలా సాహెబ్ ఠాక్రే వలె కాకుండా ఏకంగా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠమెక్కాడు. అధికారానికి ఇంత దగ్గరగా ఉన్నా కూడా విఫలమయ్యామనే వాస్తవాన్ని నరేంద్ర మోడీ, అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్‌లకు మింగుడు పడలేదు. ఒకప్పుడు అత్యంత నమ్మకమైన మిత్రపక్షం కూడా బీజేపీకి ద్రోహం చేసిందని భావించారు. సహజంగానే బీజేపీ, శివసేన పార్టీలు మిత్రపక్షాలు. రెండు పార్టీల సిద్దాంతాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు అది శివసైనికుల పనేనని బాలా సాహెబ్ ఠాక్రే గర్వంగా ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడం..
బీజేపీ, శివసేన పార్టీలు 1993 నుంచి 1998 వరకు కలిసి ప్రభుత్వాన్ని నడిపాయి. ఎప్పుడైతే బాలా సాహెబ్ థాకరే చనిపోయాడో అప్పుడే రాజకీయ పరిణామాలు కూడా నెమ్మదిగా మారిపోయాయి. 2014లో బీజేపీ తన భాగస్వామి(శివసేన) కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పుడు ఆ పార్టీకి(బీజేపీ) ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడం శివసేనకు తప్పలేదు. ఎందుకంటే ఎక్కువ సీట్లు బీజేపీ సాధించింది గనుక. ఈ వాస్తవాన్ని అంగీకరించడం ఠాక్రే కుటుంబానికి చాలా కష్టమైంది. అప్పటికే భంగపడ్డ థాకరేల ఆత్మగౌరవంపై దేవేంద్ర ఫడ్నవీస్ వర్కింగ్ స్టైల్ మరింత నిప్పు రాజేసింది. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీల నాయకత్వానికి భిన్నంగా నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ.. అధికారం చేజిక్కించుకోవడం కోసం శివసేనను కూడా వదిలిపెట్టదనే విషయం ముందుగానే ఆ పార్టీ(ఉద్ధవ్ ఠాక్రే) గ్రహించింది. ఊహించినట్లుగానే షిండే రూపంలో రాజకీయం సంక్షోభం తలెత్తింది. ఏక్ నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేయడంతో సర్కార్ కూలిపోయే పరిస్థితి పడింది.
శివసేనకు రాజకీయ సంక్షోభం కొత్తేమీకాదు..
గణేష్ నాయక్, ఛగన్ భుజబల్, నారాయణ్ రాణే, రాజ్ థాకరే వంటి అగ్ర నాయకులు గతంలో శివసేనను విడిచివెళ్లారు. అయితే.. ఆ పార్టీలో నిలువునా చీలికకు కారణమైన ఏక్ నాథ్ షిండేలా తిరుగుబావుటా ఎగరవేయలేదు. ప్రస్తుతం షిండే వద్ద 35మంది ఎమ్మెల్యేలకు పైగా ఉన్నారని తెలుస్తోంది. ఇది శివసేన పార్టీ పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
మహారాష్ట్రలో మహావికాస్ ఆగాధీ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు తొందర పెడుతున్న పరిణామాలు రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నిక. 2019లో బీజేపీ, శివసేన కూటమి నుంచి బైటికొచ్చి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో చేతులు కలిపి మహావికాస్ ఆగాధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకోవడం కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. ఒకప్పుడు శివసేన లో రెండో స్థానం లో ఉన్న నారాయణ్‌రాణ ఉద్దవ్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జోస్యం చెప్పారు. ఆయన ఉద్ధవ్‌తో విభేదాల కారణం గానే శివసేన నుంచి కాంగ్రెస్‌లోచేరి ఆ తర్వాత బీజేపీలో ప్రవేశించారు. ఆయన కేంద్రంలోఏ పార్టీ అధికారంలో ఉన్నా తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. ఆయన మాదిరిగా శివసేనలో ఉద్దవ్ థాకరేతో విభేదాల కారణంగా ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం తిరుగు బాటు చేశారు.21 మంది ఎమ్మెల్యేలతో ఆయన గుజరాత్ సూరత్‌లోని ఒక హొటల్‌లో తిష్ఠ వేశారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరో ఐదుగురు కూడా షిండే శిబిరంలో చేరినట్టు కథనం. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 288కాగా ఇద్దరు ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కన్నుమూశారు.బీజేపీ బలం 134. మరో పదకొండు మంది ఉంటే బీజేపీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి సాధారణ మెజారిటీ లభిస్తుంది. 2019 లో తమ పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా దెబ్బతీసిన ఉద్ధవ్ థాకరేని గద్దె దింపేందుకు, ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే అదను గా కమలనాథులు భావిస్తున్నారు. పైగా రాష్ట్రపతి ఎన్నిక ల్లో ఓట్లు అవసరం కనుక, ఇదే సమయంలో ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ముహూర్తం పెట్టారు.ఈ పరిణామాలన్నీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుస న్నల్లోనే జరుగుతున్నట్టు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఆమాటకొస్తే, రెండున్నర దశాబ్దాలు పైగా సాఫీగా సాగిపోతున్న బీజేపీ శివసేన సంకీర్ణ కూటమి చీలిపోవడానికి సంజయ్ రౌత్ కారణ మనీ, ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లి లో అమిత్‌షా, బీజేపీ జాతీయా అధ్యక్షుడు జెపీ నడ్డాతో సంప్రదింపులు జరుపుతూ, వేగంగా మారుతున్న మహారాష్ట్ర రాజకీయ పరిణామా లను వారికి వివరిస్తున్నారు. జరుగుతున్న పరిమాణా మాలను శ్రద్ధగా పరిశీలిస్తే 2019లో జరిగిన దానికి అంతకుఅంతా బదులు తీర్చుకోవడానికి బీజేపీ కృత నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అసలీ పరిణామాలు ఇలా చోటు చేసుకోవడానికి ఉద్ధవ్ థాకరే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే జోక్యం విపరీతంగా పెరిగి పోవడమేనని షిండే వర్గీయులు పేర్కొంటున్నారు. బాలథాకరే ఆశయాలకు కట్టుబడి పార్టీని అధికారంలోకి తెచ్చారనీ,సీనియర్లను పక్కన పెట్టి ఆదిత్యథాకరే పెత్తనం చేస్తున్నారని షిండే ఆరోపించారు. కాగా, ఏకనాథ్‌కి ముఖ్యమంత్రి పదవిపై ఎప్పటినుంచో కన్ను ఉంది.2019లోమహాఆగాధీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏక్‌నాథ్‌కి వచ్చిందనీ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అడ్డుపడటంతో ఉద్దవ్ థాకరే కూటమి నాయకత్వాన్ని స్వీకరించాల్సి వచ్చిందని షిండే అనుయాయులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా శివసేనతో భావసారూప్యం లేని పార్టీలై న కాంగ్రెస్,ఎన్సీపీలతో ఉద్ధవ్ థాకరే చేతులు కలపడాన్ని మొదటి నుంచి షిండే వ్యతిరేకిస్తున్నారనీ, పదవి కోసం కాకుండా బాల్‌థాకరే సిద్ధాంతాలను పరిరక్షించేందుకే షిండే ప్రయత్నిస్తున్నారని ఆయన వర్గీయులు పేర్కొం టున్నారు. కాగా,షిండేని లెజిస్లేచర్ పార్టీ నాయకత్వ పదవి నుంచి ఉద్ధవ్ తొలగించారు.దాంతో ఇరువర్గాల మధ్య సామరస్యం కోసం జరుగుతున్న ప్రయత్నాలు మరింత జటిలమయ్యాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని తెరవెనుక నుంచి నడిపిస్తున్న శరద్ పవార్ ఎట్టి పరిస్థి తుల్లోనూ తాము బీజేపీతో జత కట్టబోమనీ, అలాగే, బీజేపీ అధికారంలోకి రాకుండా చూస్తానని ప్రకటించా రు. ఆయన ముంబాయిచేరుకుని వివిధ వర్గాలతో చర్చ లు జరుపుతున్నారు. మరాఠా స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరొంది న ఆయన ఏం మంత్రం వేస్తారో చూడాలి.అది పని చేయకపోతే ఉద్దవ్ థాకరే ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఏక్‌నాథ్ షిండేతో ఉద్దవ్ థాకరే ఫోన్‌లో మాట్లాడారు. షిండేతో పాటు వెళ్లినవారు తిరిగి వస్తే వారి డిమాండ్స్ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు షిండే శిబిరం లో ఎమ్మేల్యేలకు రక్షణ లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ శిందే తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను సూరత్‌లోని శిబిరానికి తరలించడంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. దిన దిన గండంగా కొనసాగుతున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అసమ్మతి నేతతో ఠాక్రే ఫోన్లో మాట్లాడినా తుది ఫలితమేమిటో తెలియరాలేదు. తిరుగుబాటు వర్గం డిమాండ్లు ఏమిటో కూడా వెల్లడి కాలేదు. మరోవైపు తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా యత్నిస్తోంది. ఏక్‌నాథ్ శిందే నుంచి ప్రతిపాదన వస్తే ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ఇంకోవైపున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మంగళవారం దిల్లీలో అగ్రనేతలతో భేటీ కావడం గమనార్హం. 2019 నవంబరులో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దానిని కూల్చడానికి ప్రయత్నించడం ఇది మూడోసారని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ధ్వజమెత్తారు. తాజా సంక్షోభాన్ని శివసేన అంతర్గత విషయంగా పేర్కొన్న ఆయన…ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమస్యను అధిగమించగలరన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ కూడా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ భవితవ్యంపై ఆశాభావం వ్యక్తం చేసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను సురక్షితమైన శిబిరాలకు తరలిస్తున్నాయి. అసంతృప్త నేత ఏక్‌నాథ్ శిందేను పార్టీ శాసనసభా పక్షనేత పదవి నుంచి శివసేన తొలగించింది. ఆయన స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించింది. అధికారం కోసం మోసం చేసే వ్యక్తిని కాదంటూ ఏక్‌నాథ్ శిందే ట్వీట్ చేశారు. శిబిరానికి తరలి వెళ్లిన తర్వాత ఆయన నుంచి వచ్చిన తొలి స్పందన ఇది. ‘బాల్ ఠాక్రేకు మేం విధేయులమైన శివ సైనికులం. అధికారం కోసం మేం మోసం చేయం. బాలాసాహెబ్, ఆనంద్ దిఘే నేర్పించిన హిందుత్వ పాఠాలను మరిచిపోం’ అని మరాఠీలో ట్వీట్ చేశారు. శాసనసభా పక్షనేత హోదా నుంచి తప్పించిన నేపథ్యంలో.. ట్విటర్ బయో నుంచి ‘శివసేన’ అన్న పదాన్ని శిందే తొలగించారు.
శిబిరంలో ఎంతమంది ఉన్నారు?
శిందే తిరుగుబాటుతో ఎంవీఏ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆయన వెంట 14 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. సూరత్‌లోని హోటల్‌లో ఏర్పాటైన శిబిరంలో ఎంత మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయంపై స్పష్టత రాలేదు. శిందేతో కలిపి 23 మంది అక్కడ ఉండవచ్చని కొందరు చెబుతుండగా…ఆ సంఖ్య 25 నుంచి 30 వరకూ ఉండవచ్చని మరో అంచనా. మంగళవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబయిలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశానికి కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీకి శివసేన నుంచి 56 మంది ఎమ్మెల్యేలు ఎన్నికకాగా ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం 55 మంది ఉన్నారు.
అసెంబ్లీలో ఎవరి బలమెంత?
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గాను ప్రస్తుతం 287 మంది సభ్యులున్నారు. అధికార ఎంవీఏ(శివసేన-55, ఎన్సీపీ-53, కాంగ్రెస్-44) కూటమి సొంత బలం 152 కాగా స్వతంత్ర, చిన్న పార్టీల ఎమ్మెల్యేలు 15 మంది మద్దతిస్తున్నారు. విపక్ష భాజపాకు 106 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్, స్వాభిమాని పక్ష, రాష్ట్రీయ సమాజ్ పార్టీ, జన సురాజ్య పార్టీ, మరో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి పది మంది మద్దతిస్తుండడంతో కమలం పార్టీ బలం 116గా ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 144 మంది సభ్యుల మద్దతు అవసరం. శిందే వెంట కనీసంగా 30 మంది వస్తేనే భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే శిందే వెంట 37 మంది(2/3 వంతు) సభ్యులు ఉండాలి.
మహారాష్ట్ర శాసనమండలిలోని 10 స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఆ ఎన్నికల్లో అధికార ఎంవీఏ భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్సీపీలు రెండేసి సీట్లలో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించాయి. విపక్ష భాజపా సొంతంగా అయిదు స్థానాలను గెలుచుకోగలిగింది. కమలం పార్టీకి నలుగురు అభ్యర్థులను గెలిపించుకోగల సంఖ్యా బలం(106) మాత్రమే ఉన్నప్పటికీ అయిదుగురిని బరిలోకి దించి అన్నింటా విజయం సాధించింది. కూటమిలోని మూడు పక్షాలు కలిసి (రెండేసి సీట్ల చొప్పున) ఆరు స్థానాల్లో పోటీ చేసినా అయిదుగురే విజయం సాధించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పక్కనే ఉన్న ఏక్‌నాథ్ శిందే ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారని శివసేన నేత ఒకరు తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు బసచేసిన సూరత్‌లోని హోటల్ వద్ద 400 మందికి పైగా పోలీసులతో గుజరాత్ ప్రభుత్వం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఎవరీ ఏక్‌నాథ్!
మహారాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ శిందే… అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నేత. ఒకప్పుడు ఆటో రిక్షా నడిపి జీవనం సాగించిన పరిస్థితి ఆయనది. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇన్‌ఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో పార్టీ కిసాన్‌నగర్ శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1997లో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఠాణె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో రాష్ట్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. శివసేన శాసనసభా పక్షనేతగానూ ఉన్న శిందేను తాజా వివాదంతో ఆ పదవి నుంచి తొలగించారు.
తిరుగుబావుటా ఎందుకు!
శివసేనలో బలమైన నేతగా ఉన్న ఏక్‌నాథ్ శిందే(58) తిరుగుబాటుకు నాలుగు ప్రధాన కారణాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
* ప్రభుత్వ బాధ్యతలన్నీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒక్కరే చూసుకుంటున్నారని, ఇది శిందేకు నచ్చలేదని సమాచారం. మహా వికాస్ అఘాడీ ఏర్పడిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ఏక్‌నాథ్.. శివసేన శాసనసభాపక్ష నేతగా ఎంపికవడంతో సీఎం పదవి వస్తుందని ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఆ పదవిని ఉద్ధవ్ చేపట్టారు.
* ఎంపీ సంజయ్ రౌత్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరగడం ఏక్‌నాథ్ శిందేకు నచ్చట్లేదు.
* సీఎం పదవిని చేపట్టిన ఉద్ధవ్ తన తనయుడిని కేబినెట్‌లోకి తీసుకోవడం, తర్వాతి సీఎం ఆయనే అంటూ పరోక్షంగా ప్రచారాలు చేయించడంపై ఏక్‌నాథ్ ఆగ్రహంతో ఉన్నారు.
* రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల తన ప్రతిష్ఠ దిగజారిపోతోందని శిందే భావిస్తున్నారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మహా వికాస్ అంఘాడి (ఎంబీఎం) కూటమి ప్రభుత్వం పెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. శిసేన నేత, ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఠాక్రేకు షాకిచ్చాడు. శివసేన ఎమ్మెల్యేలతో పాటు, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మొత్తం 46 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో తెగతెంపులు చేసుకొని బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ ఎమ్మెల్యేలు అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. ఠాక్రే మాత్రం రాజీపడి బీజేపీతో కలిసేకంటే అసెంబ్లీని రద్దుచేయడానికే మొగ్గుచూపుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు క్యాబినెట్ అత్యవసర సమావేశంను నిర్వహించి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటిస్తారని సమాచారం.
Maharashtra Political Crisis: రసవత్తరంగా ‘మహా’ రాజకీయం.. అసెంబ్లీ రద్దు యోచనలో ఉద్ధవ్ ఠాక్రే?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి వ్యూహరచన చేసింది మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవటంతో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ మద్దతుతో ఫడణవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవటంతో మూడు రోజుల్లోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు కలిసి మహా వికాస్ అంఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మహా వికాస్ అంఘాడీ కూటమికి ఝలక్ ఇచ్చేందుకు గత ఆరు నెలల నుంచి ఫడణవీస్ పావులు కదిపారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. తనను మూడు రోజుల సీఎంగా మార్చిన మహా వికాస్ అంఘాడీ కూటమిలో చీలిక తెచ్చేందుకు ఫడవీస్ పక్కాగా వ్యూహరచన చేశారు. చురుకైన రాజకీయ ఎత్తుగడలతోనే ఏక్ నాథ్ షిండేను పావుగా ఉపయోగించి సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు సిద్ధమయ్యారు.
ముంబయి: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ‘మహా వికాస్ అఘాడీ’ ఎప్పుడైనా కూలిపోవచ్చని తరచూ వార్తలు వచ్చినప్పటికీ… తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా ఉండదని భాగస్వామ్య పక్షాలు చెప్పుకుంటూ వచ్చాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన (Shiv Seva) ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసి కూటమికి షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నరేళ్ల తర్వాత రెబల్‌గా మారిన శివ సైనికులు.. తమ నిర్ణయం వెనుక కాంగ్రెస్, ఎన్‌సీపీ భాగస్వామ్యపక్షాల తీరే కారణమంటున్నారు. వారి వల్లే ఇలా రెబల్‌గా మారాల్సి వచ్చిందని అసమ్మతి ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.
శివసేన నాయకుడు ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde)తోపాటు దాదాపు 40 మంది రెబల్ నేతల బృందం ప్రస్తుతం అస్సాంలోని గువాహటిలో క్యాంపు వేసింది. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అసమ్మతి నేత, మహారాష్ట్ర మంత్రి సందీపన్ భూమ్రే.. ”మాకు శివసేన నాయకత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదు. ఎన్‌సీపీ, కాంగ్రెస్ మంత్రుల తీరుతోనే ఇబ్బందులు పడుతున్నాం. ఆ పార్టీలకు చెందిన మంత్రిత్వ శాఖల నుంచి పనుల అనుమతులు పొందడం ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది” అని సందీపన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆ రెండు పార్టీల నేతల ప్రవర్తన వల్ల మంత్రిగా ఉండి కూడా ప్రజా సమస్యలను తీర్చలేకపోతున్నామని అన్నారు.
కాంగ్రెస్, శివసేన మంత్రుల ప్రవర్తనే తమను ఇలా తిరుగుబాటు చేసేలా చేసిందని శివసేనకు చెందిన మరో అసమ్మతి ఎమ్మెల్యే సంజయ్ శిర్సాథ్ అన్నారు. గువాహటిలో 35 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ఆయన.. ఈ సాయంత్రానికి ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో వచ్చి కలుస్తారని చెప్పారు. వీరితోపాటు మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతూ తమకు ఉందని సంజయ్ వెల్లడించారు.
Shiv Sena: శివసేనలో సంక్షోభం కొత్తేం కాదు. 56 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇప్పటికి నాలుగు సార్లు తిరుగుబాట్లు జరిగాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడిన శివసేనలో ఇప్పుడు వచ్చిన తిరుగుబాటు, సంక్షోభం కాస్త గట్టిదేనని చెప్పాలి. ఒకరిద్దరు ఎదురు తిరగడం, మహా అయితే పది మంది ఎమ్మెల్యేలను పట్టుకుపోవడమే జరిగింది. కాని, ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, శివసేన పార్టీ తమదేనని రెబల్స్ షాక్ ఇవ్వడం.. ఇదివరకెప్పుడూ జరగనిదే. పైగా షిండే తిరుగుబాటు మినహా మిగిలిన సంక్షోభాలన్నీ బాల్‌థాక్రే హయాంలో జరిగాయి. వాటిని గట్టెక్కించి, పార్టీని నడిపించారు బాల్‌థాక్రే. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.
ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించడం అనేది శివసేనలో మొదలైంది చగన్ భుజ్‌బల్‌తోనే. 1991లో శివసేనలో జరిగిన అనూహ్య పరిణామం అప్పట్లో అందరినీ షాక్‌కి గురించేసింది. ఓబీసీ నాయకుడైన భుజ్‌బల్.. గ్రామీణ ప్రాంతాల్లోనూ శివసేన బలోపేతం కోసం చాలా కృషి చేశారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో శివసేన పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. కాని, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా మాత్రం మనోహర్ జోషికి ఇచ్చారు పార్టీ అధినేత బాల్ థాక్రే. దీంతో మనస్తాపానికి గురైన భుజ్‌బల్.. 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ వీడారు.
థాక్రే మంత్రాంగంతో 12 మంది ఎమ్మెల్యేలు తిరిగి శివసేన గూటికి రావడంతో సంక్షోభం సమసిపోయింది. 1999లో నారాయణ రాణె రూపంలో మరోసారి తిరుగుబాటు వచ్చింది. పార్టీలోని మరో కీలక నేత బాల్‌థాక్రేకు ఎదురుచెప్పారు. పైగా నారాయణ రాణెను ఏరి కోరి ముఖ్యమంత్రిని చేసింది శివసేన అధినేత బాల్ థాక్రేనే. అలాంటిది.. ఏకంగా బాల్‌థాక్రేపైనే నారాయణ ఎదురు తిరిగారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో నారాయన రాణెకు పట్టు ఉండడం, చేతిలో సీఎం పదవి ఉండడంతో మొత్తం పార్టీనే తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నించారు.
పైగా నారాయణ రాణెపై పార్టీ వ్యతిరేక పనులు చేస్తూ, టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో నారాయణ రాణెను 2005లో పార్టీ నుంచి బహిష్కరించారు బాల్‌థాక్రే. 2006లో సొంత కుటుంబం నుంచే బాల్‌థాక్రేకు వ్యతిరేకత ఎదురైంది. శివసేన పగ్గాలు ఎవరికి ఇస్తారనే విషయంపై అప్పట్లో అంతర్గత పోరు తీవ్రంగా నడిచింది. బాల్‌థాక్రే తమ్ముడి కొడుకు రాజ్ థాక్రే.. శివసేన పార్టీ పగ్గాలు ఆశించారు. కాని, బాల్‌థాక్రే మాత్రం.. వారసుడిగా ఉద్ధవ్ థాక్రేనే ఎంచుకున్నారు. మెల్లమెల్లగా రాజ్‌థాక్రేకి పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు.
దీంతో రాజ్‌థాక్రే 2005లో పార్టీకి రాజీనామా చేసి, 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే రూపంలో మరోసారి సంక్షోభం తలెత్తింది. ఉద్ధవ్ థాక్రే సీఎం అయ్యాక కుమారుడు ఆదిత్య థాక్రేకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం షిండేకు నచ్చలేదు. చివరికి తన శాఖ వ్యవహారాల్లో కూడా ఆదిత్య థాక్రే జోక్యం చేసుకోవడం షిండేలో ఆగ్రహం మరింత పెంచింది. పైగా శివసేనలో కింద స్థాయి నుంచి ఎదిగిన షిండేకి పార్టీపై మంచి పట్టు ఉండడంతో.. తిరుగుబాటు చేశారు. షిండే కొట్టిన దెబ్బకి ప్రస్తుతం శివసేన ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ సంక్షోభాన్ని ఉద్ధవ్ థాక్రే ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 24 గంటల్లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే.. కూటమి నుంచి వైదొలిగే అంశాన్నిపరిశీలిస్తామని అన్నారు. తమ డిమాండ్లన్నీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. రెబల్స్ ఎమ్మెల్యేలలో 21 మంది తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వాళ్లంతా ముంబై చేరుకున్నాక పరిస్థితులు చక్కబడతాయన్నారు.
‘రెబల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి కమ్యూనికేట్ చేయకూడదు. ముంబై తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు.. బలపరీక్ష జరిగినప్పుడు అందరూ చూస్తారు. బలపరీక్ష దాకా వస్తే అధికార కూటమి మహా వికాస్ అఘాడి గెలుస్తుంది. శివసేనకు ద్రోహం చేయాలనుకునేవారు బాల్‌థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరు’ అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్త: శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్!
మరోవైపు శివసేన పార్టీ పూర్తి ఆధిపత్యంపై ఏక్‌నాథ్ షిండే పట్టు సాధించారు. మొత్తం 42 మంది ఎమ్మెల్యేలతో వీడియో విడుదల చేశారు. 42 మందిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. విల్లు బాణం గుర్తు కోసం ఈసీకీ లేఖ రాసే యోచనలో షిండే ఉన్నారు. శివసేన పార్టీ సింబల్ తమకే కేటాయించాలని అంటున్నారు. కాగా ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్దవ్ ఠాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు.
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో శివసేన చీలికదశలో ఉండగా ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన తర్వాత కీలకంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తన వైఖరిని స్పష్టం చేసింది.
తమ పార్టీ అధికారంలో ఉండేందుకు బీజేపీతో జతకట్టబోమని ఎన్సీపీ మంత్రి జయంత్ పాటిల్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వంపై స్పష్టత ఇచ్చారు. ‘ఎంవీఏ కూటమి ప్రభుత్వం ఉంటే అధికారంలో ఉంటాం. ప్రభుత్వం కూలిపోతే ప్రతిపక్షంలో కూర్చొంటాం’ అని అన్నారు. అయితే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఆ స్టేజ్‌కి పరిస్థితి దిగజారితే, అప్పుడు దాని గురించి మాట్లాడతామని అన్నారు.
మరోవైపు శివసేన పార్టీలో గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిశితంగా పరిశీలిస్తున్నారని జయంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వం స్థిరంగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన తమకు చెప్పారన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు తాము మద్దతిస్తామని అన్నారు. ఎన్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరుగుతుందని వెల్లడించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శిభిరంలో కేవలం 13 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని వెలుగు చూడటంతో ఆ పార్టీ కార్యకర్తలు హడలిపోయారు. గురువారం సీఎం ఇంట్లో జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనారు. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 13 మంది మాత్రమే సీఎం ఉద్దవ్ ఠాక్రే వైపు ఉన్నారని స్పష్టంగా వెలుగు చూసింది.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే శిభిరంలో కేవలం 13 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని వెలుగు చూడటంతో ఆ పార్టీ కార్యకర్తలు హడలిపోయారు. గురువారం సీఎం ఇంట్లో జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనారని శివసేనకు చెందిన ఓ సీనియర్ నాయకుడు మీడియాకు చెప్పారు. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 13 మంది మాత్రమే సీఎం ఉద్దవ్ ఠాక్రే వైపు ఉన్నారని, మిగిలిన వాళ్లు ఏక్ నాథ్ షిండే నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారని స్పష్టంగా వెలుగు చూసింది.
Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు చేసిన కుట్రగా ప్రతిపక్ష పార్టీలతో పాటు దేశంలోని అన్ని వర్గాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటుకు దారితీసిన కారణాలను జాబితా చేసిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆదిత్య ఠాక్రేతో కలిసి అయోధ్య పర్యటనకు వచ్చిన శాసనసభ్యులను పార్టీ హైకమాండ్ అడ్డుకున్నదని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీని నిజమైన ప్రతిపక్షం అని పిలిచిన ఎమ్మెల్యే, రెండు పార్టీల నాయకులు ఠాక్రేను కలవచ్చనీ, అయితే సేన ఎమ్మెల్యేలు అందుకు సిద్ధంగా ఉండరంటూ చెప్పుకొచ్చారు. శివసేన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి అధికారిక బంగ్లా వర్షను సందర్శించే అవకాశం లేదని పేర్కొన్నారు.
హిందూత్వ, రామమందిరం పార్టీకి కీలకమైన అంశాలు అయినప్పుడు, పార్టీ మమ్మల్ని అయోధ్యకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంది? అని ప్రశ్నించారు. ఆదిత్య ఠాక్రే పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేలను పిలిచి అయోధ్యకు వెళ్లకుండా అడ్డుకున్నారు అని లేఖలో రాశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నాయకులు, కార్యకర్తలు ఠాక్రేను కలిసే అవకాశం ఉండేదని ఆయన పేర్కొన్నారు. “మేము ముఖ్యమంత్రిని కలవలేకపోయినా, మా ‘అసలు ప్రతిపక్షం’ నుండి ప్రజలు.. కాంగ్రెస్, ఎన్సీపీ ఆయనను కలిసే అవకాశాలను పొందారు. వారి నియోజకవర్గాలలో పనికి సంబంధించిన నిధులు కూడా వారికి ఇవ్వబడ్డాయి” అని పేర్కొన్నారు. ఠాక్రేను ఎవరు కలవాలో చుట్టుపక్కల ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ”రాష్ట్రంలో శివసేన సీఎం ఉన్నప్పటికీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వర్ష బంగ్లా (సీఎం నివాసం) వెళ్లే అవకాశం రాలేదు. సీఎం చుట్టూ ఉన్నవాళ్లు ఆయనను కలవాలా వద్దా అని నిర్ణయించుకునేవారు. మమ్మల్ని అవమానించారని భావించారు” అని అన్నారు.
శివసేన సైద్ధాంతికంగా కాంగ్రెస్, ఎన్సీపీతో బంధాన్ని తెంచుకునీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసోంలో గౌహతిలో క్యాంప్ చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనను కలసి కోరితే ముఖ్యమంత్రి పదవికి, శివసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని థాకరే బుధవారం చెప్పారు. అతను తన అధికారిక నివాసం వర్ష నుండి ప్రైవేట్ బంగ్లా మాతోశ్రీకి మారాడు. గురువారం ఉదయం గౌహతిలో శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల రెబల్ గ్రూపులో మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చేరారు. ఇతర ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్న గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. నిన్న రాత్రి గౌహతిలో మరో నలుగురు ఎమ్మెల్యేలు షిండేతో కలిసి వచ్చారు. దీంతో గత 24 గంటల్లో రెబల్ గ్రూపులో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. రెబల్ గ్రూప్ లో చేరుతున్న శివసేన నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఎలాంటి పార్టీ ఎలా అయింది.. ఒకప్పుడు ముంబయితో సహా మహారాష్ట్రను శాసించింది. ఆ మాటకొస్తే బాల్ ఠాక్రే మాతోశ్రీ నుండి కేంద్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు. అన్నిటికి మించి కాషాయానికి పేటెంట్ లా దశాబ్దాల పాటు నిలిచిన పార్టీ శివసేన. మరాఠా ప్రజల ఆత్మగౌరవానికి మారుపేరుగా, భూమిపుత్రుల ఉద్యమానికి చిరునామాగా నిలిచిన శివసేన తన జూనియర్ పార్టీ బిజెపి ఎత్తుగడలకు నేలమట్టమౌతోందా? కింగ్ మేకర్ గా ఉన్నంత కాలం బలంగా ఉంది.. తానే కింగ్ అవ్వాలని భావించిన శివసేన చివరికి భంగపడింది. శివసేనకు తిరుగుబాటు రాజకీయాలు కొత్త కాకున్నా, ఇప్పుడు వచ్చిన సంక్షోభం చిన్నది కాదు. దీన్ని తట్టుకుని ఏ మేరకు నిలబడుతుంది? అసలు శివసేన మిగులుతుందా లేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం పతనం అంచులకు వెళ్లడానికి అనేక కారణాలున్నాయి. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు ఒక్కటే కాదు.. అంతకు ముందు కూడా అనేక సమస్యలున్నాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది మొదలు… అడుగడుగునా గండాలనే ఎదుర్కొంది. రెండు మూడు నెలలకోసారి ఏదో ఒక ఇష్యూతో ఇరుకునపడుతూనే ఉంది. ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లాల్సి రావడం, అవినీతి ఆరోపణలు. బోలెడంత రాజకీయ రచ్చ. మొత్తంగా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అగాధంలోనే ఉంది మహావికాస్ అఘాడీ ప్రభుత్వం.
దినదిన గండం అన్నట్టుగా సాగిన మహాసర్కారు, చివరికి అనూహ్యపరిణామాల మధ్య తీవ్ర సంక్షోభంలో పడింది. కర్ణుడి చావులాగానే మహాసర్కారు పతనానికి కూడా కారణాలు అనేకం. అగ్గి బరాటా లాంటి బాల్ ఠాక్రే వారసుడైన ఉద్ధవ్ థాకరేలో వ్యూహ చతురత ఉంది కానీ… ఆయన ఒక సాఫ్ట్ పర్సన్. రాజకీయాల్లో మెతక వైఖరి పనికిరాదు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉద్ధవ్ థాకరే. శివసేన గుర్తు పులి. అందుకే ఉద్ధవ్‌ను గాండ్రించలేని పులి అంటారు. ఆయన మృదు స్వభావంతోనే పార్టీ చీలిపోయే పరిస్థితికి వచ్చింది. పార్టీపై నియంత్రణ కోల్పోవడంతో అధికారం చేజారే పరిస్థితి ఏర్పడింది. ఉద్ధవ్ వైఖరి తండ్రి తీరుకి పూర్తిగా భిన్నం. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో నేర్పు ఉన్నప్పటికీ… శివసేన సహజ లక్షణమైన దూకుడు వైఖరి ఉద్ధవ్‌లో లేకపోవడం అతిపెద్ద మైనస్ అంటారు విశ్లేషకులు.
అటు ముఖ్యమంత్రిగానూ ఉద్ధవ్ థాకరే పనితీరు గొప్పగా ఏమీలేదని సమాచారం. అడ్మినిస్ట్రేషన్‌పై డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఉన్నంత పట్టు కూడా సీఎం ఉద్ధవ్ థాకరేకు లేదన్నది వాస్తవం. మహారాష్ట్ర వికాస్ అఘాఢీ ఎన్నికలకు ముందు ఏర్పడినది కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల తర్వాత ఏర్పాటయింది. శివసేన మంత్రులకు ఏ పనిచేయాలన్న సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు రావాల్సిందే. మరోవైపు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మితిమీరిన జోక్యం కూడా ప్రభుత్వంలో ఉంది. తమ నియోజకవర్గాలకు నిధులు తగ్గిస్తున్నారని కంప్లైంట్ చేసినా ఉద్ధవ్ పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కూటమిలో ఎన్సీపీ, కాంగ్రెస్‌లకే ఎక్కువ మంత్రి పదవులున్నాయి. ఉద్ధవ్‌కు పాలనపై పట్టులేకపోయినా… లక్కీగా డెవలప్మెంట్ ఆగలేదు. మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ ఎకానమీ కాబట్టి నిధులకు ఢోకా లేదు. అభివృద్ధి ఏమీ కుంటుపడకపోగా… చాలా పనులు జరిగిపోయాయి. అలాగే ఎమ్మెల్యేలకు టైమ్ ఇవ్వడు అనేది ఉద్ధవ్‌పై ఉన్న మరో కంప్లైంట్. పాలనపై దృష్టి పెట్టడం కంటే…తన ప్రవృత్తులపైనే ఉద్ధవ్ కు ఎక్కువ ఆసక్తి అన్న ప్రచారం ఉంది.
శివసేనకు ఒకప్పుడు బీజేపీతో సన్నిహిత సంబంధాలుండేవి. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి అధికారం చేపట్టింది. అయితే బాలాసాహెబ్ ఉన్నంతకాలం శివసేనదే పైచేయి. అద్వానీ, వాజ్‌పేయి లాంటి బీజేపీ అగ్రనేతలు కూడా బాలాసాహెబ్ ముందు అణగిమణిగి ఉండేవారు. ప్రమోద్ మహాజన్ వీరికి సంధానకర్తగా వ్యవహరించేవారు. హిందుత్వ సంరక్షణ విషయంలో కొన్నాళ్లకు బీజేపీని మించిపోయింది శివసేన. బాల్‌థాకరేను హిందూ హృదయ సామ్రాట్ అని పిలిచేవారు. బాలాసాహెబ్ ఉన్నన్నాళ్లు ఆ కుటుంబంలో ఎవరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. రాజకీయ పార్టీ నడిపినా… బాల్ థాకరే కూడా ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనెప్పుడూ కింగ్ మేకరే. కానీ ఉద్ధవ్ థాకరే చేతుల్లోకి వచ్చేసరికి పార్టీ మారింది. 2019 ఎన్నికలనాటికి థాకరే కుటుంబ వారసులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాల్సిందేనన్న భావనకు వచ్చేశారు. ఎన్నాళ్లు కింగ్ మేకర్‌గా ఉండేకంటే కింగ్ కావాలన్న కోరిక వారిని ప్రత్యక్ష రాజకీయాల వైపు నడిపించింది. థాకరే కుటుంబంలో మొదటిసారిగా బాలాసాహెబ్ మనుమడు, ఉద్ధవ్ పెద్ద కొడుకు … ఆదిత్య థాకరే ఎన్నికల్లో పోటీకి దిగారు. థాకరే కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి వ్యక్తి ఆదిత్యనే. కుటుంబ రాజకీయాల్లో భాగంగానే… హిందుత్వ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిందనే వాదన కూడా ఉంది.
2014లో వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ… శివసేన, బీజేపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. బీజేపీకి ఎక్కువ సీట్లు ఉండడంతో… ఆ పార్టీ వ్యక్తి సీఎం అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. బీజేపీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటు జరిగిపోతోందనే ముందు సీఎం పదవిని షేర్ చేసుకోవాలని కండిషన్ పెట్టింది శివసేన. రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. సీఎం పదవి ఇచ్చేదిలేదని బీజేపీ తెగేసి చెప్పేసింది. ఇదే అదనుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చక్రం తిప్పారు. మరాఠా రాజకీయాల్లో బద్ధ శతృవులుగా శివసేనతో మచ్చిక చేసేకునే ప్రయత్నం చేశారు. దీనికోసం కాంగ్రెస్‌ను కూడా ఒప్పించారు. సీఎం పదవిని ఉద్ధవ్ థాకరేకు వదిలేసి కీలక మంత్రి పదవులను ఎన్సీపీ, కాంగ్రెస్ పంచుకున్నాయి. ఇది మూడు పార్టీల కార్యకర్తలకు కూడా షాకే.
దశాబ్ధాల పాటు బద్ద శతృవులుగా ఉన్న శివసేన-ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అధికారం కోసం జట్టుకట్టడంతో శివసైనికులను అసంతృప్తిలో పడేసింది. అన్నేళ్లు ఎవరికి వ్యతిరేకంగా పోరాడామో… వారితోనే కలవడాన్ని శివసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అందులో ఏక్ నాథ్ షిండే కూడా ఒకరు. ఇప్పుడు షిండే ఆధ్వర్యంలోనే మహాసర్కారు పతనమౌతోంది.
శివసేన గురించి మాట్లాడాలంటే ఓ ఐదు దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి..మరాఠా హక్కులు, భూమిపుత్రుల నినాదంతో శివసేన ఏర్పాటు చేశారు బాలాసాహెబ్ ఠాక్రే. తర్వాత హిందుత్వాన్ని భుజాలకెత్తుకున్నారు. ముంబయి, థానే, పాల్ఘర్, కొంకణ్, మరఠ్వాడా ప్రాంతాల్లో శివసేన విస్తృతంగా విస్తరించింది. బాలాసాహెబ్ ఒక్క పిలుపు ఇస్తే ముంబయి గజగజా వణికిపోయేది. బంద్ అంటే ముంబయి మహానగరంలో ఒక్క దుకాణం తెరచుకునేది కాదు. బాల్ ఠాక్రే మాటలు తూటాలు. ఒకసారి ఒక్క మాట అంటే… వెనక్కు తిరగడమన్నది జరగనేలేదు. కోర్టు కేసులు, రాజకీయ సవాళ్లు దేనికి వెరవలేదు.
రాజ్యాంగ బద్ధంగా ఎదిగిన రాజ్యాంగేతర శక్తి బాల్ ఠాక్రే. అవస్థలో ఉన్న వ్యవస్థను తన చెప్పు చేతల్లోకి తీసుకున్న వ్యక్తి బాల్ ఠాక్రే. మరాఠీ ప్రజల కోసం తన ప్రాణం ఇవ్వడానికైనా… ప్రాణం తియ్యడానికైనా సిద్ధమన్న నాయకుడు. భూమి పుత్రుల సిద్ధాంతంతో తెరపైకి వచ్చి… కరడుగట్టిన ప్రాంతీయ తత్త్వంతో ముందుకెళ్లిన శివసేనను అడుగడుగూ నడిపించిన మరాఠా యోథుడు బాల్ ఠాక్రే. కరడు గట్టిన ప్రాంతీయ వాది అని విమర్శించినా… అరాచకవాదని ప్రత్యర్థులు ఆడిపోసుకున్నా…. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరిదాకా నిలబడ్డాడు బాల్ ఠాక్రే.
1966 జూన్ 19న శివసేన ను స్థాపించిన ఠాక్రే, 1971 వరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరాఠా రాష్ట్రంలో మరాఠీలను వివక్షకు గురి చేసే ఆగ్రహ భావన నుంచి పుట్టిన పార్టీ అనతి కాలంలో ముంబైకర్లను ఆకర్షించింది. మహరాష్ట్రలో అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగ యువతను ఆకర్షించింది. మహరాష్ట్ర విద్యార్థులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పారిశ్రామిక వేత్తలపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. మరాఠా రాజకీయాలను శాసించిన ఠాక్రే… ఎన్నోసార్లు సంచలన ప్రకటనలతో ముందుకెళ్లాడు. భూమి పుత్రుల సిద్ధాంతం చుట్టూ అల్లుకున్న శివసేన… ముంబై రాజకీయాలను ఐదు దశాబ్దాలు రూల్ చేస్తోంది..
ఎవరెన్ని చెప్పినా… కరడు గట్టిన హిందూత్వ వాదిగా తెరపైకి వచ్చిన బాల్ ఠాక్రే… ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆ బాటను వీడలేదు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత జరిగిన అల్లర్లలో శివసేన పాత్ర ఉందని, ముంబై వరుస పేలుళ్ల తర్వాత సిక్కుల ఊచకోతకు శివసేనే కారణమని కోర్టులు హెచ్చరించినా కించిత్ కూడా బెదరలేదు. ఆఖరికి కోర్టులే కేసులు కొట్టేశాయి కానీ థాక్రే మాత్రం ఎవరికీ సంజాయిషీ చెప్పలేదు. రాజకీయాల్లోకి వచ్చిన దశాబ్దానికి తాను ప్రతిపాదించిన భూమి పుత్ర సిద్ధాంతం పలచబడుతుండటంతో ప్రాక్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మరో అజెండాను లేవనెత్తారు. స్వతహాగా జర్నలిస్ట్ అయిన ఠాక్రే.. తన పత్రిక సామ్నాలో రాసే సంపాదకీయాలు మహారాష్ట్ర ప్రజల్ని కదిలించేవి.
నేనో మరాఠా పుత్రుడిని. ఆ తర్వాతే భారతీయుడిని… ఈ మాటలు చాలు… బాల్‌థాక్రే తన మాతృభూమికి ఎంత ప్రాధాన్యమిస్తాడో చెప్పడానికి. మఠారీ మనూస్ అంటే మరాఠీలకే మహారాష్ట్ర అన్న నినాదమే ఆయన్ను నడిపించింది. రాజకీయంగా గెలిపించింది. ఇంత చరిత్ర ఉన్న శివసేన ఇప్పుడు సంక్షోభం అంచున ఉంది.
పెద్దపులి ఎప్పుడూ గర్జించాలి. అదే దానికి ప్రత్యేకతను నిలబెడుతుంది. రాజకీయాల్లోనూ నేతలు అలాగే ఉండాలి. ఒకపార్టీని నడుపుతున్న సమయంలో మరింత జాగ్రత్తగా పార్టీశ్రేణులపై పూర్తి పట్టు కలిగి ఉండాలి. ఏ మాత్రం పట్టుజారినా మొదటికే మోసం వస్తుంది. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిణామం. క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరొందిన శివసేన నిలువునా చీలిపోతోంది.
బాల్‌ఠాక్రే ఉన్న సమయంలో ఆయన మాటలు తూటాల తరహాలో దూసుకువచ్చేవి. ఉద్ధవ్ వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నం. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో దిట్ట అయినా శివసేన సహజమైన దూకుడు వైఖరి లేకపోవడం ఒక మైనస్. ఆయన కుమారుడు యువనేత ఆదిత్య రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా పాఠాలు నేర్వలేదు. దీంతో అనేకమంది కార్యకర్తలు భాజపా లేదా ఇతర కాషాయ పార్టీలవైపు వెళ్లారు.
సీఎంగా ఉద్ధవ్ పగ్గాలు చేపట్టకపోయింటే ఏక్‌నాథ్ సీఎం అయ్యేవారు. అయితే ఉద్ధవ్ స్వయంగా సీఎం కావడంతో అయన ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఠానే, పాల్ఘార్ జిల్లాల్లో ఏక్‌నాథ్ షిండే తిరుగులేని నేత. పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించడంలో ఆయనదే కీలకపాత్ర. సమయం కోసం వేచిచూస్తున్న ఆయనకు ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలు తోడవటం, బిజెపితో సంబంధాలతో తిరుగుబాటు నేతగా ఆవిర్భవించారు. గతంలోనూ శివసేన నుంచి చగన్ భుజ్‌బల్, నారాయణ్‌రాణే వంటి సీనియర్ నేతలు తిరుగుబాటు స్వరం వినిపించి వెళ్లిపోయారు. కానీ, ఇంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం ఇదే మొదటిసారి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే తిరిగి వస్తాననేది షిండే వాదన. దిగిపోవడానికైనా సిద్ధమే కానీ.. తగ్గేదే లేదని ఠాక్రే కుటుంబం వాదన.
పవర్ లోకి వచ్చింది మొదలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అన్నీ గండాలే. కలగూరగంప లాంటి ప్రభుత్వంపై అవినీతి మరకలు కూడా ఎక్కువయ్యాయి. ముంబయి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ED, CBI దర్యాప్తులు బోలెడంత రచ్చగా మారాయి. ఇద్దరు మంత్రులు పదవులు పోగొట్టుకుని జైళ్లకెళ్లారు. మరోవైపు ఇంత జరిగినా… కూటమి ఏర్పాటుకు కారకుడైన శరద్ పవార్… ఎక్కడ కూడా పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రయత్నం చేయలేదు. ఆయన ఎప్పటికప్పుడు మౌనం పాటిస్తూ వచ్చారు. అది వ్యూహాత్మకం అంటారు కొందరు. కానీ జరుగుతున్న రచ్చను కంట్రోల్ చేయకుండా మౌనంగా ఉండి వ్యూహాత్మకం అంటే ఎలా అనేది అతిపెద్ద ప్రశ్న. తాజా సంక్షోభంలోనూ ఆయన మౌనమే ప్రత్యర్థులకు అస్సెట్ అనే మాట వినిపిస్తోంది. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు మంట అయితే… శరద్ పవార్ మౌనం ఆ మంటల్లో పోసిన పెట్రోల్ అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా శరద్ పవార్ సోకాల్డ్ వ్యూహాత్మక మౌనం కూడా సంక్షోభానికి దారి తీసిందనే చర్చ వినిపిస్తోంది.
శివసేనకు సంక్షోభాలు కొత్త కాదు. ఆ పార్టీ చరిత్రలో ఇలాంటి మహా సంక్షోభాలు ఇంతకుముందు మూడు ఏర్పడ్డాయి. తాజా సంక్షోభం నాలుగవది. ఇంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలో వచ్చిన మూడు సంక్షోభాలు శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఉన్నప్పుడు చోటుచేసుకోగా… ప్రస్తుతం ఆయన కొడుకు ఉద్ధవ్ థాకరే… హయాంలో నాలుగో సంక్షోభం ఏర్పడింది. శివసేనకు 1991లో మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాలకు పార్టీ విస్తరించడంలో కీలకంగా వ్యవహరించిన OBC నేత ఛగన్ భుజ్బల్ శివసేనను వీడడం పెద్ద నష్టాన్నే కలిగించింది. ఆ సమయంలో శివసేనను వీడిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది మళ్లీ వెనక్కి వచ్చారు.
ఆ తర్వాత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణె శివసేనను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నారాయణ్ రాణే… కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారు. 2006లో పార్టీని భారీ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బాలాసాహెబ్ తమ్ముడి కొడుకు, ఫైర్ బ్రాండ్ రాజ్ ఠాక్రే… శివసేనను వీడడం మహారాష్ట్రలో అతిపెద్ద షాకింగ్ న్యూస్. శివసేనను వీడిన రాజ్ థాకరే… మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన పేరుతో పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే రూపంలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది శివసేన.
మొత్తం 42 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని ఏక్ నాథ్ షిండే వర్గం చెబుతోంది. తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండేపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఆయనకు 37మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అందుకే శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్ షిండేను గుర్తించాలని కోరుతూ 34 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాశారు. అందులో నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా చాలా సందర్భాల్లో పెద్ద స్థాయిలో సంక్షోభాల నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది శివసేన. మరి ఈసారి ఫలితం ఎలా ఉండబోతోంది..? తిరుగుబాటును ఉద్ధవ్ అణచివేయగలరా..? సమస్యలన్నీ సర్ధుకుని శివసేన మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందా..? మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నిలబడుతుందా..? లేక ఏక్ నాథ్ షిండే బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా..? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే..
ఈ పరిణామాల మధ్య మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సంక్షక్షభంలో పడింది. ఒకే భావజాలం ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ తమకు విరుద్ధమైన భావజాలమున్న శివసేనతో జట్టు కట్టడం అసహజం అంటున్నారు తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే. అందుకే ఈ అసహజ పొత్తును తెంచుకోవాల్సిందేనని ఆయన డిమాండ్. అంతేకాకుండా బీజేపీతో శివసేన కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఏక్ నాథ్ షిండే తమకు అనుకూలమే కాబట్టి… ఈ ఛాన్స్ వదులుకోకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్ధానాలున్నాయి. అందులో బీజేపీకి 106, శివసేనకు 56, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44, ఎంఐఎంకు 2, ఆర్‌ఎస్పీ1, జేఎస్‌ఎస్1, ఇండిపెండెంట్లు, ఇతరులు 24 ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేనకు చెందిన ఓ స్ధానం ఖాళీ ఉంది. ఈ మధ్య నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్ధులు గెలిచారు. శాసన మండలి ఎన్నికల్లో కూడా ఐదుగురు అభ్యర్ధులను గెలిపించుకుని మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది బీజేపీ. రాజ్యసభ ఎన్నికలప్పుడే బీజేపీ గేమ్ మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది. శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఇతరుల బలమున్నప్పటికీ కేవలం 52 ఓట్లు పోలయ్యాయి. అదే బీజేపీకి తగినంత సంఖ్యా బలం లేకపోయినప్పటికీ 134 ఓట్లు పోల్ అయ్యాయి. దీన్ని బట్టి బీజేపీకి 134 మంది సభ్యుల బలముందని స్పష్టమవుతోంది. మెజార్టీ నిరూపించుకోవాలంటే మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది.
2019లో శివసేన తమకు అధికారం అందకుండా చేసిందన్న కసి బీజేపీలో ఇంకా ఉంది. ఇప్పుడు బీజేపీకి అవకాశం అందివచ్చింది. ఎలాగూ కుంటుతున్న ఈ ప్రభుత్వాన్ని ఒక తోపు తోస్తే కూలిపోతుంది కదా అనే ప్లాన్ బీజేపీది అనే వాదనలున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 144మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తనకు 40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు. వారంతా బీజేపీతో కలసి నడిస్తే… మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం లాంఛనమే.
ఈ పరిణామాలను గమనిస్తే, ఐదు దశాబ్దాలకు పైగా మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన ఇప్పుడు భారీ సంక్షోభంలో ఉందనే చెప్పాలి. బిజెపి వ్యూహాల ముందు భావజాలంలో మిత్రులైనా నిలబడటం కష్టమనే అంశం స్పష్టమౌతుంది. బాల్ ఠాక్రే లాంటి బలమైన వ్యక్తి చేతుల్లో ఎదిగిన శివసేన భవిష్యత్తు, ఇప్పుడు తర్వాతి తరం నేతల బలహీనతలతో ప్రమాదంలో పడిందని చెప్పవచ్చు.