ప్రస్తుతం టీం ఇండియా మొదటి జట్టు ఇంగ్లండ్ లో ఉన్న న్యూజిలాండ్‌తో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో.. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనుండగా రెండో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అయితే ఈ రెండో జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీఎంపిక చేసింది. లంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. ఇక ఐపీఎల్ లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు మొదటిసారి జట్టులో అవకాశం దక్కింది. ఈ లంక పర్యటనకు ఎంపికైన భారత జట్టు ఇదే…
టీం ఇండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పాడికల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, నితీష్ రానా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు సామ్సన్ (వికెట్ కీపర్, రాహుల్ చాహర్, గౌతమ్, క్రునాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), దీపక్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా