సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి కుమారుడు ఎ. శ్రీకర్ ప్రసాద్. ప్రముఖ దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ ఆయనకు పెదనాన్న. ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టా పొందిన శ్రీకర్ ప్రసాద్ తండ్రి సంజీవి వద్ద ఎడిటింగ్ లో ఓనమాలు దిద్దుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎనిమిది సార్లు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి శ్రీకర్ ప్రసాద్. తాజాగా ఆయన ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…