సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి కుమారుడు ఎ. శ్రీకర్ ప్రసాద్. ప్రముఖ దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ ఆయనకు పెదనాన్న. ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టా పొందిన శ్రీకర్ ప్రసాద్ తండ్రి సంజీవి వద్ద ఎడిటింగ్ లో ఓనమాలు దిద్దుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎనిమిది సార్లు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి శ్రీకర్ ప్రసాద్. తాజాగా ఆయన ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘విరాట పర్వం, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలకు ఎడిటింగ్ చేస్తున్నట్టు తెలియజేశారు. తమిళంలో మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వం’ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇక హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన వార్ మూవీ ‘షేర్షా’ విడుదలకు సిద్ధమైందని అన్నారు. ఎడిటింగ్ లో వచ్చిన మార్పులు, ఎడిటింగ్ పై ఆసక్తితో చిత్రపరిశ్రమకు వచ్చేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీనియర్స్ టాక్ లో భాగంగా మా ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ హెడ్ సుబ్బారావుతో ఆయన పంచుకున్న అనుభవాలు మీకోసం….