PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తు్న్నారు. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వీరిని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ, పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read Also: Pakistan: దాయాదికి అంత దమ్ము ఉందా? పాక్ బట్టలు విప్పిన జర్నలిస్ట్ పాకిస్తాన్ ఆర్మీ ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు…
India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.
Pakistan: శుక్రవారం రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై విషం వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా అన్ని అబద్ధాలనే ప్రచారం చేశాడు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై తామే గెలిచామంటూ, భారతదేశాన్ని శత్రువుగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు కోసం తాను విజ్ఞప్తి చేశానని, కానీ భారతదేశం ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ విషాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించాడు.
Pakistan: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారతదేశ ‘‘హిందుత్వ’’ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని అబద్ధాలను ప్రచారం చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం అని చెబుతూ, జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంఘటనను ప్రస్తావిస్తు ‘‘హిందుత్వ తీవ్రవాదం’’ ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపించాడు.
USA: పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తాకింది. పాకిస్తాన్లో చమురు నిల్వలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రకటన చేశాడు. పాకిస్తాన్లో బిలియన్ల విలువైన నిల్వలు ఉన్నాయని చెప్పాడు. అయితే, ఇప్పుడు అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, ట్రంప్ వాదనలకు విరుద్ధంగా ప్రకటన చేశారు. పాకిస్తాన్లో చమురు నిల్వలను అన్వేషించడంలో అమెరికాకు ఆసక్తి లేనది చెప్పాడు. Read Also: RBI Digital Payment Rules: యూజర్స్ కు అలర్ట్.. డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ…
Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య వినాశకరమైన యుద్ధాన్ని ట్రంప్ నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి.
న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమతి శిఖరాగ్ర సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్‌లో ట్రంప్ పాల్గొన్నారు.
ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ సమావేశాల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన బృందం నేటి నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో 80వ ఐరాస కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.
India: సౌదీ అరేబియా-పాకిస్తాన్ కీలకమైన ‘‘వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని’’ కుదర్చుకున్నాయి. దీని ప్రకారం, ఒక దేశంపై దాడి రెండు దేశాలపై దాడిగా గుర్తిస్తామని ఒప్పందం నొక్కి చెబుతోంది. దీని ద్వారా, భారత ప్రయోజనాలకు దెబ్బపడే అవకాశం ఉంది. దీనిపై భారత్ స్పందించింది. భారత్- సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తున్నట్లు భారతదేశం తెలిపింది.