Saudi-Pakistan: కిరాయికి పాకిస్తాన్ సైన్యం.. సౌదీ అరేబియాతో ఒప్పందంలో కీలక విషయాలు..
- కిరాయికి పాకిస్తాన్ సైన్యం..
- సౌదీ అరేబియాలో 25,000 మంది మోహరింపు..
- బదులుగా పాక్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..
- ఇటీవల పాకిస్తాన్-సౌదీల మధ్య రక్షణ ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi-Pakistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చావు దెబ్బలు, ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలని దాయాది భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని ఆధునీకీకరించుకోవాలని భావించడంతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సౌదీ అరేబియా రూపంలో ఓ ఆశ పాకిస్తాన్‌కు చిగురించింది. డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికైనా ఇప్పుడు ఆ దేశం సిద్ధంగా ఉంది. ఇటీవల, సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా ఇద్దరి పై జరిగినట్లే అని పాకిస్తాన్ ప్రగల్భాలు పలికింది.
ఇదిలా ఉంటే, సౌదీ అరేబియా పాకిస్తాన్ కు 10 బిలియన్లు పెట్టుబడి ప్యాకేజీని అందించనుంది. అయితే, దీనికి ప్రతిగా దాదాపుగా 25,000 మంది పాక్ సైనికుల్ని సౌదీ అరేబియాలో మోహరించాలని అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఆర్మర్స్, ఫిరంగి, పదాతిదళం, రాకెట్ యూనిట్లతో కూడిన నాలుగు ఆర్మీ బ్రిగేడ్‌లను, రెండు వైమానిక దళ స్క్వాడ్రన్‌లు, రెండు నావికా దళాలను మోహరించడం జరుగుతుంది. ఒక లెఫ్టినెంట్ జనరల్ నేతృత్వంలో ఇవన్నీ పనిచేస్తాయి. ఇద్దరు మేజర్ జనరల్స్, 8 మంది బ్రిగేడియర్లు సహాయం చేస్తారు. వీరంతా సౌదీ సైన్యంతో ఉమ్మడి కార్యకలాపాలు, శిక్షణ వంటి వాటిలో పాల్గొంటారు. పాకిస్తాన్‌కు ఎయిర్ డిఫెన్స్, రాకెట్ కమాండ్ నిర్మాణాలకు సౌదీ సహాయం చేయనుంది.
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
Read Also: NRI Arrest: భార్యపై వేధింపులు.. అమెరికాలో తిరుపతికి చెందిన ఎన్నారై అరెస్టు
అయితే, ఈ ఒప్పందంపై చైనా ప్రభావం కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్ కు అందిన చైనీస్ సాంకేతిక కూడా సౌదీ అరేబియాకు బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు 5వ తరం యుద్ధవిమానాల అభివృద్ధిలో సహకరించే ప్రణాళికలు ఉన్నాయి. సౌదీ JF-17, J-10 యుద్ధ విమానాలను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని చైనా సవాల్ చేసినట్లు అవుతుంది.
మరోవైపు, పాకిస్తాన్‌కు సౌదీ పెట్టుబడుల రూపంలో సాయం చేయనుంది. మౌలిక సదుపాయాలు, ఇంధనం, మైనింగ్, భద్రతా రంగాల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని అందుకుంటుంది. అప్పులు, ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ నిల్వల సమస్యల నుంచి పాకిస్తాన్‌ను గట్టెక్కించడం ఈ ఆర్థిక ప్యాకేజీ లక్ష్యం. సౌదీ అరేబియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ నుంచి 15 బిలియన్ డాలర్లకు పెంచాలని, ఆఫ్ఘానిస్తాన్, భారత్ వంటి దేశాలతో దౌత్యపరంగా పాకిస్తాన్ కు సాయం చేయాలని యోచిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే దేశ రక్షణ కోసం వాడాల్సిన సైన్యంతో పాకిస్తాన్ వ్యాపారం చేస్తోందని దీంతో స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!