Salman Khan – Pakistan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన పాకిస్థాన్ ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టం (1997)లోని నాల్గవ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ పేరును చేర్చినట్లు దాయాది దేశం స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల జాబితా ఇది. సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఈ జాబితాలో చేర్చడంతో ఆయన కార్యకలాపాలను దాయాది దేశం నిశితంగా…
Saudi-Pakistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చావు దెబ్బలు, ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలని దాయాది భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని ఆధునీకీకరించుకోవాలని భావించడంతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సౌదీ అరేబియా రూపంలో ఓ ఆశ పాకిస్తాన్‌కు చిగురించింది. డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికైనా ఇప్పుడు ఆ దేశం సిద్ధంగా ఉంది. ఇటీవల, సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ…
దీపావళి పురస్కరించుకుని హిందువులకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అసలు పాకిస్థాన్‌లో హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ నెటిజన్లు నిలదీశారు.
Pakistan: ఈజిప్ట్ ‘‘షర్మ్ ఎల్ షేక్’’లో గాజా శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్, హమాస్ సంతకాలు చేశాయి. దీనికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పలు దేశాధినేతలు హాజరయ్యారు. అయితే అన్నింటి కన్నా ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ట్రంప్‌ను పొగుడుతున్న వీడియో తెగ వైరల్ అయింది. అమెరికా అధ్యక్షుడిని ‘‘శాంతి దూత’’ అని షరీఫ్ ప్రశంసించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు ట్రంప్‌కు పాకిస్తాన్ ప్రధాని థాంక్స్ తెలిపారు.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఈజిస్ట్ షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన శాంతి సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ఆసిమ్ మునీర్‌ను తన ‘‘ అభిమాన ఫీల్డ్ మార్షల్’’ అంటూ పిలిచారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తనకు మద్దతు తెలిపారని, అందుకు ఆయనకు థాంక్స్ అని ట్రంప్ అన్నారు.
ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులంతా హాజరయ్యారు. ట్రంప్ ప్రసంగించిన తర్వాత మాట్లాడాల్సిందిగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఆహ్వానించారు.
US-Pakistan: ఉగ్రవాద దేశానికి అమెరికా మద్దతు తెలుపుతోంది. యూఎస్ పాకిస్తాన్ సంబంధాలు నానాటికి బలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ప్రయోజనాల కన్నా, సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీ, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పాకిస్తాన్‌తో జతకట్టి భారత వ్యతిరేక పనుల్ని చేస్తున్నాడు.
Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.
Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్…
Pakistan: అమెరికాకు చాలా సన్నిహితంగా మారుతున్న పాకిస్తాన్, కొత్త పథకానికి తెరతీసింది. అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఓడరేవును నిర్మించాలని భావిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను యూఎస్ ముందు ఉంచింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది.