గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లిహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ సింగర్ శ్రీలలిత. మొక్కలు నాటడం సంతోషంగా ఉంది..ప్రకృతి మనకు తల్లిలాంటిది అని అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు శ్రీలలిత. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అప్రతిహతంగా సాగిపోతోంది. సినీతారలు, సెలబ్రిటీలు ఎక్కువగా మొక్కలు నాటుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లలిత మాట్లాడుతూ ఎంపీ సంతోష్…
ఇండియన్ ఐడల్ 12 సీజన్ ముగిసింది. పవన్ దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. ఫైనల్ కి చేరిన ఆరుగురిలో ఆయన నంబర్ వన్ గా ట్రోఫిని స్వంతం చేసుకున్నాడు. పాతిక లక్షల ప్రైజ్ మనీతో పాటూ మారుతీ వారు బహూకరించిన కార్ కూడా పవన్ స్వంతమైంది. 2021 ఇండియన్ ఐడల్ గా ఘనత సాధించిన పవన్ దీప్ “అంతా కొత్తగా ఉంద”ని చెప్పాడు! తనని విజేతగా ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదని తెలిపాడు. ఇక…
విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన సందేశం అందించాడు! ఆయన పంపిన స్పెషల్ వీడియో షణ్ముఖ ప్రియ కోసం ప్లే చేశారు! ఆమె తప్పకుండా ‘ఇండియన్ ఐడల్ 12’ టైటిల్ గెలుస్తుందని విజయ్ నమ్మకంగా చెప్పాడు కూడా! ఇక షణ్ముఖ స్టార్ హీరో కనిపించటంతోనే ఉబ్బితబ్బిబైపోయింది! ఆదివారం, ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 నుంచీ రాత్రి 12 దాకా 12 గంటల పాటూ ఇండియన్ ఐడల్ ఫినాలే జరగనుంది. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది…
ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు వచ్చేసింది. ఆగస్ట్ 15న గ్రాండ్ ఫినాలే ఉండవచ్చని అంటున్నారు. అయితే, ఈ సారి ఎపిసోడ్ లో అతిథులుగా వెటరన్ మ్యూజీషియన్ బప్పీ లహరి, డైరెక్టర్ ఒమంగ్ కుమార్ పాల్గొంటున్నారు. ఇక లెటెస్ట్ ప్రోమోలో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘మేరీ కామ్’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ రూపొందించిన ఒమంగ్ కుమార్… షణ్ముఖని ఆకాశానికి ఎత్తేశాడు! ఆమె సింగింగ్ అద్భుతం అంటూ పొగడ్తలు కురిపించాడు.…
‘ఇండియన్ ఐడల్’ మ్యూజిక్ రియాల్టీ షోకి దేశ వ్యాప్తంగా పేరుంది. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 12 నడుస్తోంది. అయితే, మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ కూడా కాంపిటీషన్ లో పాల్గొంటోంది. అంతే కాదు, తన టాలెంట్ తో టైటిల్ దక్కించుకునే ప్రయత్నంలో గట్టిగా కృషి చేస్తోంది. దాదాపుగా ప్రతీ వారం షో నిర్వహించే జడ్జీల నుంచీ ప్రశంసలు పొందే షణ్ముఖప్రియ ఈసారి బాలీవుడ్ లెజెండ్ జీనత్ అమన్ వద్ద నుంచీ మెప్పు పొందనుంది. ఈ వీకెండ్…