టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్సు ఉన్న కెప్టెన్ గా ఎంఎస్ ధోని నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన రికార్డును సాధించాడు. ధోని 41సంవత్సరాల 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు.
Also Read : Somu Veerraju: ప్లాన్ ప్రకారమే దాడి.. ఇది పిరికి చర్య..
ఇప్పటి వరకు ఈ రికార్డును దివంగత ఆస్ట్రేలియా స్పన్నర్ షేన్ వార్న్ పేరిట ఉండేది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2011 సీజన్ లో 41 ఏళ్ల 249 వయస్సులో రాజస్థాపన్ రాయల్స్ కెప్టెన్ గా షేన్ వార్న వ్యవహారించాడు. తాజా మ్యాచ్ తో వార్న్ 12 ఏళ్ల ఘనతను మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్ లో సీఎస్కేకు నిరాశ ఎదురైంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేందించింది.
Also Read : Bandi Sanjay : నిరుద్యోగ భృతి హామీ..ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుబ్ మన్ గిల్ (63) అద్భుతమైన ఇన్సింగ్స్ ఆడాడు. ఆఖర్లో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసిన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అటూ చెన్నై ఇన్నింగ్స్ లో బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (92) కూడా అద్బుతమైన బ్యటింగ్ తో అదరగొట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న అతను మాత్రం వరుసగా బౌండరీలతో చెలరేగుతు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఆఖర్లో ఎంఎస్ ధోని కూడా ఒక ఫోర్, సిక్స్ తో చెలరేగాడు.