Gina Stewart Reveals Her Affair With Shane Warne: ఆస్ట్రేలియా దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ఈ ఏడాది మార్చిలో థాయిలాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే! క్రికెట్‌లో రారాజుగా వెలుగొందిన ఈయనకు ప్లే బాయ్ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్‌లు నడిపాడని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా అతను చనిపోయిన నాలుగు నెలల తర్వాత.. వార్న్‌తో తాను ఎఫైర్ నడిపానంటూ ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్ బాంబ్ పేల్చింది. వార్న్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తనతో ఎఫైర్‌లో ఉన్నాడని, బయటి ప్రపంచానికి తెలియకుండా ఈ ఎఫైర్‌ని సీక్రెట్‌గా నడిపామని ఆమె కుండబద్దలు కొట్టింది.
షేర్ వార్న్ చనిపోవడానికి ముందు అతడు తనతో రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉండేవాడని, అయితే తమ ఎఫైర్ కేవలం స్నేహపూరితమైందని గినా పేర్కొంది. 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా తనకు వార్న్‌తో తొలిసారి పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తాము స్నేహితులమయ్యామని చెప్పింది. గైడ్‌గా తనకు సలహాలు ఇచ్చేవాడని, ఈ క్రమంలోనే తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పింది. అలా అతనితో డేటింగ్ చేశానని చెప్పిన గినా.. ఇక దగ్గరయ్యాడని అనుకునేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బాధపడింది. అతని మరణవార్త తనని తీవ్రంగా కలచివేసిందని, ఆ విషాదం నుంచి కోలుకునేందుకు తనకు చాలా రోజుల సమయం పట్టిందని వెల్లడించింది.
తమ మధ్య ఉన్న ఎఫైర్ బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్ తనతో ప్రామిస్ వేయించుకున్నాడని, అందుకే అతను చనిపోయిన తర్వాత ఈ విషయాలు వెల్లడిస్తున్నానని గినా చెప్పుకొచ్చింది. అతనితో తాను మధురమైన క్షణాల్ని గడిపానని ఆమె తెలిపింది. కాగా.. ఆస్ట్రేలియాలో సెలెబ్రిటీ అయినా గినా, 51 ఏళ్ల వయసులోనూ హాట్ ఫోటోలకు పోజిస్తూ, కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రీసెంట్‌గానే ఈమె తనకు తాను ‘వరల్డ్ హాటెస్ట్ గ్రాండ్ మా’గా బిరుదు కూడా ఇచ్చుకుంది. షేర్ వార్న్‌పై చేసిన వ్యాఖ్యలతో ఈమె టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది.