పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌తో యాప్ ఆధారిత బైక్ డ్రైవర్ చేసిన సిగ్గుమాలిన చర్య సంచలనం సృష్టించింది. రైడ్ ఆలస్యం కావడంతో తన బుకింగ్‌ను క్యాన్సిల్ చేయగా, డ్రైవర్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని మహిళా డాక్టర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపు వంటి…
ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ తమీమ్ అన్సారియాలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ కొనసాగింది. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు.