పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌తో యాప్ ఆధారిత బైక్ డ్రైవర్ చేసిన సిగ్గుమాలిన చర్య సంచలనం సృష్టించింది. రైడ్ ఆలస్యం కావడంతో తన బుకింగ్‌ను క్యాన్సిల్ చేయగా, డ్రైవర్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని మహిళా డాక్టర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపు వంటి తీవ్రమైన ఆరోపణలు అతనిపై కేసులు నమోదు చేశారు.
READ MORE: Constable who shot SI: సర్వీస్ రైఫిల్‌తో ఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్.. కారణం?
రాత్రి 8 గంటలకు ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి బైక్ బుక్ చేసుకున్నానని, అయితే ఆలస్యం కారణంగా బుకింగ్‌ను రద్దు చేశానని బాధితురాలు తెలిపారు. నిందితుడు మహిళా డాక్టర్‌కు కనీసం 17 సార్లు ఫోన్ చేసి, ఆపై వాట్సాప్‌లో అసభ్యకరమైన వీడియోలను పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రైడ్‌ను రద్దు చేస్తే పరిణామాలుంటాయని డాక్టర్‌ను డ్రైవర్ బెదిరించాడు. దీని తరువాత..మహిళ మొదట పోలీసు కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి ఇ-కంప్లైంట్ చేసి, ఆపై తూర్పు జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళల భద్రత కోసం కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. మూడు నెలల క్రితం.. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత మహిళల భద్రత గురించి కలకలం రేగింది.
READ MORE:Narne Nithiin: హిట్టు కొట్టి సైలెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ బామ్మర్ది