బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జరుగుతున్న మొదటి వన్డేలో భారత టాపార్డర్ విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ 73 పరుగులతో రాణించడంతో ఇండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.