Pathan Movie Controversy: షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రంలోని 'బేషరమ్ రంగ్' పాట పెను వివాదాన్ని సృష్టించింది. ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన బికినీ రంగుపై పలువురు నేతలు, సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Pathan: బాలీవుడ్ లో మళ్లీ అగ్గి రాజుకుంది. బాలీవుడ్ ను బ్యాన్ చేయాలి అన్న నినాదాలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకు కారణం పఠాన్ మూవీ. షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shahrukh Khan: ఎంతటి వీరుడైనా, ఎన్ని ఘనవిజయాలు సాధించినా ఏదో ఒక అసంతృప్తి వెన్నాడుతూనే ఉంటుందని అంటారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ను చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఒకప్పుడు వరుస విజయాలు చూసిన షారుఖ్ ఖాన్, కొన్నేళ్ళుగా వరుస పరాజయాలు చూస్తున్నారు. దాంతో మళ్ళీ ఓ బంపర్ హిట్ కొట్టి చూపించాలని ఆయన తపిస్తున్నారు. నిజానికి షారుఖ్ చూడని విజయాలు లేవు, ఎక్కని ఎత్తులూ లేవు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ఒక కేంద్రంలో…
Shahrukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాత్రకు తగ్గట్టు మారిపోవడంలో షారుఖ్ ఎప్పుడు ముందుంటాడు.
Bollywood: ఈ సారి దీపావళి పండగ అక్టోబర్ 24న వస్తోంది. అయితే ఒక్కో రాష్ల్రంలో ఒక్కో విధంగా సెలవు ప్రకటించారు. అక్టోబర్ 25న కొందరు సెలవు తీసుకుంటున్నారు. అదో విచిత్రం కాగా, దీపావళి ముందు రోజయిన అక్టోబర్ 23న మరో విశేషం చోటు చేసుకుంది.
(జూన్ 25న మూడు పదుల ‘దీవానా’ ముచ్చట) నేడు యావద్భారతదేశంలో ‘కింగ్ ఖాన్’గా జేజేలు అందుకుంటున్న షారుఖ్ ఖాన్ తొలిసారి బిగ్ స్క్రీన్ పై కనిపించిన చిత్రంగా ‘దీవానా’ నిలచింది. 1992 జూన్ 25న విడుదలైన ‘దీవానా’ చిత్రంతోనే షారుఖ్ ఖాన్ నటునిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోగలిగాడు. ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ ‘రొమాంటిక్ హీరో’గా జేజేలు అందుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన చిత్రంగా నిలచిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’తో షారుఖ్…
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆ కేసులో ఉండడం వల్ల, అది జాతీయంగా సెన్సేషన్ అయి కూర్చుంది. ఈ కేసులో ఆర్యన్ కొన్ని వారాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో అతడ్ని ఎన్నోసార్లు విచారించారు. షారుఖ్ ఖాన్ సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చివరికి.. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 28న ఆర్యన్‌కు ఈ కేసు నుంచి…
ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటే.. నటీనటులు గుడ్డిగా ఒప్పేసుకోరు. కథ, ముఖ్యంగా తాము పోషించబోయే పాత్ర బాగుందా? లేదా? అనేది విశ్లేషించుకుంటున్నారు. సీనియర్లైతే కచ్ఛితంగా తమ రోల్ ప్రభావవంతంగా ఉంటుందా? లేదా? అనేది బేరీజు వేసుకుంటారు. ఆ తర్వాతే సినిమాకి పచ్చజెండా ఊపాలా? వద్దా? అన్నది డిసైడ్ అవుతారు. ఒకవేళ నచ్చకపోతే, నిర్మొహమాటంగా సినిమాని రిజెక్ట్ చేస్తారు. కానీ, తాను మాత్రం తన పాత్ర నచ్చకపోయినా సినిమా చేశానని సత్యరాజ్ బాంబ్ పేల్చాడు. ఇంతకీ ఆ సినిమా…
తమిళ యువ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే! దాని పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దీనికి ‘జవాన్’ అనే పేరు ఖరారు చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఎస్.ఆర్.కె. ప్రెజంటర్ గా ఉన్నారు. ఈ మూవీ టైటిల్ కు ను ప్రకటిస్తూ ఓ టీజర్ ను విడుదల…
సంచలనం సృష్టించిన క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ పొందిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ఎన్సీబీ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. అమెరికాలో తాను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పటి నుంచే గంజాయి తాగడం మొదలుపెట్టినట్టు స్వయంగా ఆర్యన్ అంగీకరించినట్టు ఎన్సీబీ తెలిపింది. ఆ సమయంలో తాను నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడేవాడినని, గంజాయితో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఇంటర్నెట్‌లో చూసిన తర్వాతే తాను దాన్ని తీసుకోవడం ప్రారంభించానని…