Pathan: బాలీవుడ్ లో మళ్లీ అగ్గి రాజుకుంది. బాలీవుడ్ ను బ్యాన్ చేయాలి అన్న నినాదాలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకు కారణం పఠాన్ మూవీ. షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమా నుంచి బేషరమ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఏ ముహూర్తాన ఈ సాంగ్ రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి బాలీవుడ్ పతనం మొదలయ్యిందని విమర్శలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా దీపికా అందాల విందుమీటిపీమీరి ఉండడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది.
కాషాయ రంగు బికినీలో అమ్మడి అందాల ఆరబోత హద్దులు దాటి ఉంది. దీంతో బీజేపీ సైతం అమ్మడి పై విరుచుకుపడింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా ఈ డ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఆ సీన్లు, ఆ డ్రెస్ ను తొలగిస్తే సినిమాను ఉంచుతామని, లేకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని చెప్పుకొచ్చారు. అసలు పెళ్లి తరువాత దీపికా బికినీ వేసుకోవడం, అందులోనూ మరీ ఇంత దారుణంగా అందాలను చూపించి కల్చర్ ను పాడు చేస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక తాజాగా దీపికా పై కేసు కూడా నమోదు అయ్యింది. సమాచార, ప్రచార శాఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ సీన్స్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. మరి ఈ వివాదం బాలీవుడ్ పతనానికి కారణం అవుతుందా..? చూడాలి.