Aryan Khan: నిజంగా నాకు ఆ జైలు శిక్ష పడాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆ కేసులో ఉండడం వల్ల, అది జాతీయంగా సెన్సేషన్ అయి కూర్చుంది. ఈ కేసులో ఆర్యన్ కొన్ని వారాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో అతడ్ని ఎన్నోసార్లు విచారించారు. షారుఖ్ ఖాన్ సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చివరికి.. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 28న ఆర్యన్‌కు ఈ కేసు నుంచి విముక్తి కలిగింది. ఇప్పటివరకూ ఈ కేసుపై ఆర్యన్ నోరు విప్పలేదు. ఎట్టకేలకే తొలిసారి పెదవి విప్పాడు.
ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్‌తో చేసిన ఇంటర్వ్యూలో ఆర్యన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ‘‘అన్ని విషయాలు చెప్తే, నిర్దోషిగా బయటకొస్తావ్’’ అని సంజయ్ సింగ్ చెప్తుండగా.. ఆర్యన్ మధ్యలో కలగజేసుకుని తన మనసులోని ఆవేదనను వెళ్లగక్కాడు. ‘‘సర్, నా మీద మీరు ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికర్ అనే ముద్ర వేశారు. డ్రగ్ ట్రాఫికింగ్‌కు ఆర్థిక సాయం చేస్తున్నానని అన్నారు. ఈ ఆరోపణలన్నీ మీకు వెగటుగా అనిపించట్లేదా? ఆ రోజు నా దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. అయినా నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు. తప్పు చేయకపోయినా.. నేను తప్పు చేశానన్నారు. నా పేరు ప్రతిష్ఠల్ని నాశనం చేశారు. నేనెలాంటి తప్పు చేయకపోయినా, అన్ని వారాలు జైలులో ఎందుకుండాలి? నిజంగా నాకు ఆ శిక్ష పడాలా?’’ అని ఆర్యన్ ఖాన్ ప్రశ్నించాడు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కాగా.. ఈ సందర్భంగానే దర్యాప్తు సమయంలో షారుఖ్ తీవ్ర మనోవేదన అనుభవించారని సంజయ్ సింగ్ చెప్పారు. ఆర్యన్ ఖాన్ మానసిక ఆరోగ్యంపై చాలా కలత చెందారని, జైలులో ఆర్యన్ ఖాన్ బెడ్ వరకు వెళ్లి రాత్రంతా తోడుగా ఉండేవారని పేర్కొన్నారు. తన కొడుకు వద్ద డ్రగ్స్ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. నేరస్థుడిగా మార్చారంటూ వాపోయారన్నారు. అందరూ తమను రాక్షసుల్లాగా, కరుడుగట్టిన నేరస్థుల్లాగా చూశారంటూ షారుఖ్ ఆవేదన వ్యక్తం చేశారని సంజయ్ సింగ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!