Gutha Sukender Reddy: గవర్నర్ వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్ర గవర్నర్ కూడా విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం దౌర్బాగ్యం మని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా.. ఆయన అందరికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా…
కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని .. భారత దేశం కోసం కాదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సొంత రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని.. దేశ భక్తితో మాత్రం కాదన్నారు.
ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయం వుంది కాబట్టే.. తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించాఉ. ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ‘విమోచన దినం’ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే…
Telangana Liberation Day on September 17: తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని భారీగా జరపాలని బీజేపీ నిర్ణయించింది. 2022 సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17వరకు ఏడాది పాటు తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలపబడి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనుంది బీజేపీ పార్టీ. 2023 సెప్టెంబర్ 17న…
తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్ మొదలైంది. అదేరోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ సభలకు రెడీ అవుతున్నాయి. విమోచన దినం పేరుతో కమలనాథులు.. ఆత్మగౌరవ సభ పేరుతో గజ్వేల్‌లో కాంగ్రెస్ ఫోకస్‌పెట్టాయి. మరి.. టీఆర్‌ఎస్ ఆలోచన ఏంటి? అధికారపార్టీ ఏం చేయబోతోంది? తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడి! ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుంది అంటే తెలంగాణలో పొలిటికల్‌గా హాట్ హాట్ చర్చ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.…
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పోలికల్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ఈ రెండు పార్టీలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పార్టీలు జనసమీకరణపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు సెప్టెంబర్…