Bandi Sanjay: నిఖార్సైన తెలంగాణవాది.. అయితే! సీఎం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయం వుంది కాబట్టే.. తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించాఉ. ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ‘విమోచన దినం’ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే తక్షణమే విమోచనోత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమర వీరులను ఘోరంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ సీఎం పీఠమెక్కినాక ఆ అవసరమే లేదంటూ మాట తప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడానికి అసలు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకపోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ మరో జమ్మిక్కుకు ప్లాన్ చేస్తుండటం సిగ్గు చేటని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాది అయితే గతంలో ఇచ్చిన మాట మేరకు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి తీరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలంటూ అనేక ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాట, సాంస్క్రుతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు బండి సంజయ్.
Road Accident: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 4గురు మృతి, 24 మందికి గాయాలు
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!