గత వారం రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్లు వరసగా నష్టాలను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తదితర అంశాల కారణంగా దేశంలోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గత ఏడు రోజులుగా వస్తున్న నష్టాలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈరోజు ఉదయం నుంచి సూచీలు లాభాలవైపు కదిలాయి. 1329 పాయింట్ల లాభంతో 55,858 వద్ద సెన్సెక్స్ ముగియగా, నిఫ్టీ 410 పాయింట్ల…
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు…
ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులపై ఆందోళనలు పెట్టుబడిదారులను భయపెట్టడంతో గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల మధ్య అంతటా నష్టాలను చూసాయి. నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల ఇండెక్స్ 1,028.61 పాయింట్లు (1.80 శాతం) క్షీణించి 55,983.13 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ 307.50 పాయింట్లు (1.81 శాతం) తగ్గి 16,677.70 వద్దకు చేరుకుంది.…
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలనే మూట్టగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం లాభాలతోనే మొదలైనా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నుంచి క్రమం సూచీలు పడిపోతూ వచ్చాయి. ఒకదశలో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు చివరకు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 60,821 వద్ద ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 18,114 పాయింట్ల వద్ద స్థిరపడింది. Read Also: ఎంజీ అస్టర్ రికార్డ్: 20 నిమిషాల్లో…
దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాన సూచీల్లో ఒకటైన సెన్సెక్స్ 60 వేల పాయింట్లను దాటి కొత్త చరిత్రను లిఖించింది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఓ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇప్పటికే ప్రపంచంలో ఆరో అతిపెద్ద మార్కెట్లుగా నిలిచిన భారత స్టాక్ మార్కెట్లు.. త్వరలోనే ఐదో స్థానానికీ ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పసమయం…
భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటింది. అలాగే నిఫ్టీ 18 వేల పాయింట్లకు చేరువవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ సెన్సెక్స్ 60 మార్కు దాటింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా పరుగులు తీస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ మార్కెట్…
చాలా కాలం తరువాత స్టాక్ మార్కెట్లు భారీగా లాభ పడ్డాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం అయినప్పటి నుంచి భారీ లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఒకదశలో వెయ్యి పాయింట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఉదయం సెన్సెక్స్ 59,275 పాయంట్లతో ప్రారంభమయ్యి లాభాల దూకుడును ప్రదర్శించి 985.03 పాయింట్ల లాభంతో 59,885.36 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ తో పాటుగా నిఫ్టి కూడా దూకుడు ప్రదర్శించింది. 276.30 పాయింట్ల లాభంతో 17,823 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్…