స్టాక్‌మార్కెట్ అద్భుతం సెన్సెక్స్ @ 60,000
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటింది. అలాగే నిఫ్టీ 18 వేల పాయింట్లకు చేరువవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ సెన్సెక్స్ 60 మార్కు దాటింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా పరుగులు తీస్తోంది.
అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ మార్కెట్ స్పీడ్‌కు కారణమవుతున్నాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 60,260 వద్ద.. నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 17,933 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.78 వద్ద ట్రేడవుతోంది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్, హెచ్‌యూఎల్, టైటన్, ఎస్‌బీఐ, బజాజ్ ఫినాన్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
గురువారం కూడా స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూలతలు, ఫెడ్ రిజర్వ్ ప్రకటనలు, చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ నుండి వచ్చిన ఊరట ప్రకటన, దీనిని గట్టెక్కించేందుకు చైనా బ్యాంకులు ముందుకు రావడం వంటి వివిధ అంశాలు కలిసి వచ్చాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా కరోనా అనంతరం ఇటీవల రియాల్టీ మార్కెట్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకేరోజులో పెద్ద మొత్తంలో విక్రయాలు జరిపినట్లు వెల్లడించింది. ఇది రియాల్టీ సూచీ పరుగుకు కారణమైంది. శుక్రవారం మార్కెట్లు ప్రారంభం కాగానే 60 వేల మార్క్ దాటుతుందని బావించారు. అందరూ అనుకున్నట్టే చరిత్ర ఆవిష్కృతమైంది.
సెన్సెక్స్ 1,000 పాయింట్ల నుండి చారిత్రాత్మక 60,000 మైలురాయిని చేరటానికి 31 సంవత్సరాలు పట్టింది. జూలై 25, 1990 న సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల ల్యాండ్ మార్క్ టచ్ చేసింది. మార్చి 4, 2015 న 30 వేల మార్కును తాకడానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. అయితే మరో ముప్పయ్ వేల పాయింట్లు చేరటానికి కేవలం ఆరు సంవత్సరాలే కావటం విశేషం. వరసగా ఐదు వారాల నుంచి బుల్ రన్ కంటిన్యూ అవుతోంది.
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!