Today (10-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని నష్టాలతో ప్రారంభించి నష్టాలతోనే ముగించింది. ఇవాళ శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు ఎక్కువ శాతం నేల చూపులు చూశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ.. 50 పాయింట్లకు పైగా పడిపోగా.. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్ తదితర సంస్థల షేర్ల అమ్మకాలు పెరగటంతో కీలకమైన సూచీలు కోలుకోలేకపోయాయి.
Today (06-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈవారం శుభారంభం లభించలేదు. రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. ఐటీ షేర్లలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవటంతో ఇంట్రాడేలో ఇండెక్స్‌లు నెగెటివ్ జోన్‌లో కదలాడాయి. అయితే.. BROADER మార్కెట్లు మాత్రం మంచి పనితీరు కనబరిచాయి. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి.
Today (25-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రిపబ్లిక్ డే ముందస్తు జోష్ ఏమాత్రం కనిపించలేదు. నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు.. మార్కెట్ సెంటిమెంట్‌ను కుదిపేయడంతో ఫ్రంట్‌లైన్ సూచీలు ఇవాళ బుధవారం విపరీతంగా క్షీణించాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 850 పాయింట్లకు పైగా తగ్గిపోయింది. నిఫ్టీ.. బెంచ్ మార్క్ కన్నా దిగువకు పడిపోయింది. అయినప్పటికీ మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యూనీ లీవర్, హిండాల్కో, బజాజ్ ఆటో, టాటా స్టీల్ షేర్లు బాగా రాణించాయి.
Today (19-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండు రోజులు వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు కూడా సాయంత్రం నష్టాలతోనే ముగిశాయి. మార్నింగ్ సెషన్‌లో వచ్చి భారీ నష్టాలను మాత్రం ఇంట్రాడేలో కొంత వరకు పూడ్చుకోగలిగాయి. కానీ.. అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల్లో నెలకొన్న ముందుజాగ్రత్తల ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ప్రతికూలంగా పడింది.
Today (06-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త సంవత్సరం మొదటి వారం మెరుపులేమీ లేకుండానే ముగిసింది. వరుసగా మూడో రోజు కూడా.. అంటే.. ఇవాళ శుక్రవారం ఇన్‌ట్రా డేలోనూ నష్టాలు కొనసాగాయి. రెండు సూచీలు కూడా నేల చూపులే చూశాయి. ఉదయం అతి స్వల్ప లాభాలతో ప్రారంభమైన చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 60 వేల మార్క్ నుంచి దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 18 వేల మార్క్ నుంచి పతనమైంది.
Tody (22-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్.. నిన్న బుధవారం మాదిరిగానే.. ఇవాళ గురువారం కూడా లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసింది. వరుసగా రెండో రోజూ కొవిడ్ భయాలు కొనసాగాయి. ఇన్వెస్టర్లు కొత్త షేర్ల కొనుగోలు కన్నా అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో రెండు సూచీలూ నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు తగ్గి 60 వేల 826 పాయింట్ల వద్ద ముగిసింది.