Seethakka : బీజేపీపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. బీసీల రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని ఫైర్ అయ్యారు. బీసీల సాధికారత కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలన్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని అంశాలపై, ఇతర ప్రభుత్వ పథకాలపై మాట్లాడారు. బడి పిల్లల యూనిఫార్మ్ ల ద్వారా మహిళ సంఘాలకు 30…
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
తెలంగాణ రైజింగ్.. ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు.
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం ప్రజా భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు.
కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్లక్ష్యం చేసింది అని మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు. పేదల కోసం తలపెట్టిన టిడ్కో ఇళ్లను కూడా నాశనం చేసింది అని మండిపడ్డారు.
ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్‌గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ…
మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) ఈ సంవత్సరం డ్రోన్‌లు ఇవ్వనున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.