Minister Narayana: విజయవాడలో మెప్మా స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ పై శిక్షణ కార్యక్రమం. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ, మెప్మా ఎండీ తేజ్ భరత్, అన్ని జిల్లాల పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్వాక్రా, మెప్మా సభ్యులకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పుకొచ్చారు. వారి ఆర్థిక పరిస్థితి బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది అని పేర్కొన్నారు. SHG సభ్యుల ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా చేరువ కావాలంటే డేటా ప్రొఫైలింగ్ ఎంతో అవసరం.. సభ్యుల డేటా ఆధారంగా ఎవరెవరికి ఎలాంటి పథకాలు, చేయూత అందించాలనే దానిపై స్పష్టత వస్తుంది అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Read Also: Somy Ali: ‘‘సల్మాన్ ఖాన్ కన్నా లారెన్స్ బిష్ణోయ్ నయం’’.. స్టార్ హీరో మాజీ ప్రేయసి..
కాగా, గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్లక్ష్యం చేసింది అని మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు. పేదల కోసం తలపెట్టిన టిడ్కో ఇళ్లను కూడా నాశనం చేసింది అని మండిపడ్డారు. ప్రొఫైల్ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల యొక్క డేటా ప్యూరిఫికేషన్ జరుగుతుంది.. డిసెంబర్ నెలాఖరు నాటికి డేటా బేస్ మొత్తం సిద్ధం చేయాలి అని సూచించారు. జనవరి నుంచి సభ్యుల డేటా ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తోంది అని మంత్రి నారాయణ తెలిపారు.