పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 51 వేల కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది PR&RD. అయితే.. గత బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి…
Minister Seethakka: ఆదివారం కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు కావలసిన నిధులు ఎక్కడ ఆగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడిని ఉపయోగిస్తామని ఆవిడ చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్న వారందరూ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని ఆవిడ తెలియజేశారు. కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన డి. శ్రీనివాస్ మృతి తనకి తీవ్ర ఆవేదనను కలగజేసిందని…
పెంపుడు మనుషులను పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. తీన్మార్ మల్లన్న పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపిందన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారన్నారు.
మాట మాట్లాడితే హరీష్ రావు దిగిపో అంటున్నారు.. రాజీనామాలు అంటున్నారని మంత్రి సీతక్క హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె కొమురం భీం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు పదవి కాంక్ష ఏంటో తెలిసిందని, 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్నారు. చాలామందికి నువ్వు డబ్బులు ఇచ్చావని నీకు పదవి ఇవ్వకుండా ఆపారని, అప్పుడు ఎక్ నాథ్ షిండే లాగా నువ్వు వ్యవహరించవని నీకు పదవి ఇవ్వకుండా ఆపారంట.. ఇవి అప్పట్లో వార్తలు…
రాష్ట్రంలో రంజాన్ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు.. నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని వారితో కలిసి నమాజ్ చేశారు. ఈ సందర్భంగా.. పిల్లలతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయింది అనే అసహనం కేటీఆర్ లో ఉంది.. మరో వైపు చెల్లె జైల్లో ఉందని ఆరోపించారు. ట్యాపింగ్ చేశాం అని కేటీఆర్ ఒప్పుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. విచారణలో వాళ్ళ బంధువులే నిజాలు చెప్తున్నారు.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడు.. తప్పుకు శిక్ష అనుభవిస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అనే వైపు విచారణ జరగాలని మంత్రి సీతక్క కోరారు.
తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు.
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల బడ్జెట్‌లో రూ.900ల కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్‌లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 337 ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి చుట్టూ ట్రెంచ్ కొట్టించింది.
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిసారీ తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నాని తెలిపారు. ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడంత ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా.. భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో…
Minister Seethakka: దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జెండాను ఆవిష్కరించారు.